Showing posts with label Tollywood News. Show all posts
Showing posts with label Tollywood News. Show all posts

Wednesday, 24 June 2015

బాహుబలి సెన్సార్ పూర్తి జూలై 10న ప్రేక్షకుల ముందుకు

దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి అద్భుత సృష్టి బాహుబలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా కీలక పాత్రల్ని పోషిస్తున్నారు. అర్కా మీడియా పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. కె. రాఘవేంద్రరావు సమర్పకుడు. జూలై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ చారిత్రక కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికేట్ లభించింది. ఇటీవలే విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం. తమిళ ఆడియోను ఈ నెల 24న, మలయాళ ఆడియోను 27న విడుదల చేయబోతున్నాం. చిత్ర కథ, కథనాలు, ప్రభాస్ నటన, పాత్రచిత్రణ, గ్రాఫిక్స్ హంగులు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని తెలిపారు. రమ్యకృష్ణ, సుదీప్, సత్యరాజ్, నాజర్, అడివి శేష్, ప్రభాకర్, తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కె.కె. సెంథిల్‌కుమార్, ఆర్ట్: సాబుశిరిల్, సంగీతం: యం.యం.కీరవాణి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, నిర్మాతలు: శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి.

Saturday, 24 January 2015

త్రిపురగా భయపెడుతున్న కలర్స్ స్వాతి..

అంజలి ప్రధాన పాత్రలో గత సంవత్సరం వచ్చిన గీతాంజలి మూవీ చిన్న చిత్రాల్లో పెద్ద హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో అంజలి క్యారెక్టర్ సినిమాకు హైలెట్ అయ్యింది. అంజలి తన నటనతో ప్రేక్షకులను భయపెట్టింది. ఇప్పుడు గీతాంజలి డైరెక్టర్ రాజ్‌కిరణ్ ఆ సినిమాకు సీక్వెల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో మెయిన్ రోల్ చేసేందుకు దర్శకనిర్మాతలు కలర్స్ స్వాతిని సంప్రదిస్తే ఆమె ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు త్రిపుర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది. గీతాంజలిగా అంజలి ప్రేక్షకులను ఓ రేంజ్‌లో భయపెడితే ఇప్పుడు కలర్స్ స్వాతి త్రిపురగా ఎలా భయపెట్టిస్తుందో చూడాలి.

సమీక్ష : పటాస్ రివ్యూ

సమీక్ష : పటాస్ రివ్యూ

 

తెలుగు పోస్టర్. కామ్ రేటింగ్ : 3.5/5
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘పటాస్’ సినిమా నేడు విడుదలైంది. శృతి సోది హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారంటే ప్రయోగాల కంటే కమర్షియల్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తారు. అయితే కమర్షియల్ సినిమా తీసి హిట్ట కొట్టడం అంత ఈజీ కాదు. మరి అనిల్ రావి పూడి పటాస్ లాంటి ఫక్తు కమర్షియల్ సినిమాతో సక్సెస్ కొట్టాడా. చాన్నాళ్ల నుంచి హిట్టు కోసం తపిస్తున్నా కళ్యాణ్ రామ్ కోరిక తీరిందా లేదా అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి ఎంటర్ కావాల్సిందే. కళ్యాణ్ రామ్ సినిమాలకు ఎప్పుడూ లేని రీతిలో ఈ సినిమాపై భారి అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను చేరుకుందో..? లేదో..? ఓ సారి చూడండి.
 కథ :

కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) అవినీతిపరుడైన పోలీస్ అధికారి. తనను తాను కావాలని హైదరాబాద్ కు బదిలీ చేయించుకుంటాడు. ఒకసారి అతను హైదరాబాద్ చేరగానే.. తన అధికారాలు ఉపయోగించి తప్పుడు మార్గాలలో డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు. ఈ క్రమంలో, అతను హైదరాబాద్ డిజిపి (సాయి కుమార్)కు తలనొప్పిగా మారిన స్థానిక రాజకీయ నాయకుడు (అశుతోష్ రాణా)ను ప్రోత్సహిస్తాడు.
కళ్యాణ్ సిన్హా హైదరాబాద్ రాక వెనుక ఒక నిజం ఉందని తెలుసుకున్న హైదరాబాద్ డిజిపి షాక్ కి గురవుతాడు. ఇదే కథలోని అసలైన ట్విస్ట్. ఆ నిజం ఏమిటి..? కళ్యాణ్ సిన్హా ఎందుకు అవినీతి అధికారిగా మారాడు..? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే.. మీరు వెండితెరపై కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమాను చూడాలి.

దర్శకుడు అనిల్ రావిపూడి పటాస్ కథ పట్టుకొని చాన్నాళ్లు వెయిట్ చేసి మరీ అటెంప్ట్ చేశాడు. పెద్ద హీరోలు చేసే దమ్మున్న కథ అయినా...కళ్యాణ్ రామ్ మాత్రమే చేయాలని ఏరి కోరి ఒప్పించుకున్నాడు. కళ్యాణ్ సైతం అనిల్ మీద నమ్మకం పెట్టాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు అనిల్. కళ్యాణ్ ను కొత్తగా చూపించాడు అనే కంటే... పవర్ ఫుల్ గా చూపించాడు. కళ్యాణ్ రామ్ లో ఎంత ఎనర్జీ ఉందో నిరూపించాడు. కళ్యాణ్ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం బాగుంది. డైలాగ్స్ చెప్పించిన విధానం బాగుంది. కథకు సరైన స్క్రీన్ ప్లే కుదరడంతో...ఎక్కడా సినిమా గ్రాఫ్ డ్రాప్ కాలేదు. కథకు తగ్గ కామెడీ కుదరడంతో... ఆడియెన్స్ కి ఎక్కడా బోర్ కొట్టలేదు. శ్రీనివాస్ రెడ్డి, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, ప్రభాస్ శ్రీను, పోసాని, షకలక శంకర్, జెపి కామెడీ పండించారు. పార్థాయ కామెడీ బాగా కుదిరింది. ఎం.ఎస్.నారాయణ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సునామీ సుభాష్ గా నవ్వుల్లో ముంచెత్తాడు. ముఖ్యంగా మదర్స్ యాక్షన్ ఫోర్స్ సెకాండాఫ్ కు బాగా ప్లస్ అయ్యింది. డైరెక్టర్ అనిల్ డైలాగ్స్ సైతం బాగా రాసుకున్నాడు. కళ్యాణ్ రామ్, సిస్టర్, సాయి కుమార్ మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయి. కథకు తగ్గ స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు. కథకు తగ్గ పాటలు కుదిరాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా కొట్టాడు. హీరోను ఢీకొట్టే విధంగా అశుతోష్ రానా పెర్ ఫార్మెన్స్ ట్టుఉంది. ఓవరాల్ గా డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. నందమూరి ఫ్యాన్స్ కోసం అరెవో సాంబ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్.  హీరోయిన్ శృతీ బాగానే ఉంది. కమర్షియల్ సినిమాలకు బానే వర్కవుట్ అవుతుంది. 

కళ్యాణ్ రామ్ కెరీర్లో ‘పటాస్’ బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవర్ ఫుల్ హీరో క్యారేక్టరైజెషన్ మరియు స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులను ఆలరించే ఎంటర్టైన్మెంట్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. సినిమాలో ఎంటర్టైన్మెంట్ ముందు రొటీన్ కథను పెద్దగా పరిగణలోకి తీసుకోనవసరం లేదు. కమర్షియల్ మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమాను తప్పకుండా చూడండి.

మహేశ్‌కి తల్లిగా సుకన్య ...!

‘పెద్దరికం’ కథానాయిక సుకన్య గుర్తుండే ఉంటారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఆమె ఇప్పుడు కారెక్టర్‌గా నటిగా చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ‘అధినాయకుడు’లో కూడా ఓ కీలక పాత్ర చేశారు. ప్రస్తుతం మహేశ్‌బాబు తల్లిగా నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ముందు ‘లగాన్’ ఫేం గ్రేసీ సింగ్‌ను ఈ పాత్రకు తీసుకున్నారనే వార్త ప్రచారమైంది. ఫైనల్‌గా సుకన్యను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆమె పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలో ఆమె జగపతిబాబుకి భార్యగా నటిస్తున్నారు. ‘పెద్దరికం’లో అలరించిన ఈ జంట దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టిన చిత్రం ఇది. ఇందులో మహేశ్ సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్నారు.
 

ప్రయోగాత్మక పాత్రలకే ప్రాధాన్యం!


ఇటీవలే విడుదలైన బేబీ చిత్రంతో కెరీర్‌లో తొలి భారీ కమర్షియల్ విజయాన్ని దక్కించుకుంది ఈ సుందరి.

ఈ సక్సెస్ తాలూకూ ఆనందాన్ని తనివితీరా ఆస్వాదిస్తోంది తాప్సీ. ఆమె మాట్లాడుతూ బేబీ చిత్రం నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైనది. గతంలో తెలుగులో చాలా వరకు గ్లామర్ పాత్రల్లోనే నటించాను. బాలీవుడ్‌లో చేసిన తొలి చిత్రం చశ్మే బద్దూర్‌లో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించాను. దాంతో కెరీర్ ఆసాంతం మూసధోరణి పాత్రలకే పరిమితమైపోవాల్సి వస్తుందనుకున్నాను. గ్లామర్ తార అనే ముద్ర నాపై ఎక్కడ పడుతుందో అని చాలా భయపడ్డాను.

అలాంటి సమయంలోనే బేబీ చిత్రం నాకు నూతనోత్సాహాన్ని అందించింది. ఈ సినిమాతో నా ఆలోచనా ధృక్పథం పూర్తిగా మారిపోయింది. ఇందులో పోరాట ఘట్టాల కోసం చాలా శ్రమించాల్సివచ్చింది. కొన్నిసార్లు గాయాలపాలైయ్యాను. కానీ ఇప్పడు నా పాత్రకు వస్తున్న స్పందన చూస్తుంటే అనందంగా ఉంది. నా కెరీర్‌లో మరిచిపోలేని చిత్రమిది. భవిష్యత్‌లో ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలకే ప్రాధాన్యమివ్వాలని భావిస్తున్నాను. అని చెప్పింది.

మల్టీస్టారర్ చిత్రాలు చేయమని అడుగుతున్నారు



డా.రాజశేఖర్ నటిస్తున్న తాజా చిత్రం గడ్డంగ్యాంగ్. జీవితారాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సంతోష్ పీటర్ జయకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదలకు సిద్ధమవుతోంది.


ఈ సందర్భంగా డా.రాజశేఖర్ మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఆయన మరిన్ని విశేషాలు తెలియజేస్తూ తమిళ మాతృకలోని ఫీల్‌ను చెడగొట్టకుండా తెలుగులో రీమేక్ చేశాం. నా గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుండే సినిమా ఇది. ఇందులో కొత్త రాజశేఖర్‌ను చూస్తారు. జర్నీ ఫేమ్ శరవణన్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన సురేష్ పీటర్ జయకుమార్ ఈ చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అచ్చు అందించిన నేపథ్య సంగీతం, విమల్ రాంబో ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టే సినిమా అవుతుంది. ఈ చిత్రం తరువాత రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో నటించిన పట్టపగలు విడుదలవుతుంది. ఆ తరువాత అర్జున చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఈ మూడు సినిమాలే కాకుండా ఈ ఏడాది మొత్తం నాకు సంబంధించిన ఏడు చిత్రాలు విడుదల కానున్నాయి. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలు చేయమని అడుగుతున్నారు. నేను చేయదగ్గ పాత్ర ఏదైనా వస్తే నటించడానికి నేను సిద్ధమే. హీరో పాత్రలే చేస్తాను. మరే ఇతర పాత్రలు చేయను అన్న నియమ నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు. గడ్డం గ్యాంగ్ విడుదల తరువాత మల్టీస్టారర్ చిత్రాలు చేయాలనుకుంటున్నాను అన్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు గడ్డంగ్యాంగ్ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని జీవిత తెలిపింది.

మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రుద్రమదేవి



కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవి వీరగాథను వెండితెర చిత్ర రూపం చేస్తూ స్వీయనిర్మాణ దర్శకత్వంలో గుణశేఖర్ రూపొందిస్తున్న చిత్రం రుద్రమదేవి. అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తోంది. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరీయో స్కోపిక్ 3డీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మార్చి చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ సరిగ్గా రెండేళ్ల క్రితం వసంతపంచమి పర్వదినాన వరంగల్‌లోని వేయిస్థంబాల దేవాలయంలో చిత్రాన్ని ప్రారంభించాం. రెండేళ్ల పాటు మహాయజ్ఞంలా సాగిన ఈ సినిమా షూటింగ్ పూర్తయింది.

డబ్బింగ్, గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతున్నాయి. భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని వేసవి ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. కాకతీయుల చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశాను అన్నారు. రానా, సుమన్, కృష్ణంరాజు, ప్రకాష్‌రాజ్, నిత్యామీనన్, ప్రభ, కేథరిన్, జయప్రకాష్‌రెడ్డి, ఆదిత్యమీనన్, ప్రసాదాదిత్య, అజయ్, వేణుమాధవ్, ఉత్తేజ్, వెన్నెల కిషోర్, శివాజీరాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఆర్ట్: పద్మశ్రీ తోట తరణి, కెమెరా: అజయ్‌విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, మాటలు: పరుచూరి బ్రదర్స్, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ఫైట్స్: విజయ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె. రామ్‌గోపాల్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: గుణశేఖర్.

Sunday, 4 January 2015

వెంకటేష్ బ్రదర్ లాంటివాడు: పవన్ కళ్యాణ్

హీరో వెంకటేష్ తనకు సోదరుడు లాంటి వాడని హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన గోపాల గోపాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో వెంకటేష్, పవన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.... తాను వ్యక్తిగతంగా కలుసుకునే వ్యక్తుల్లో వెంకటేష్ ఒకరని చెప్పారు. సినిమాల గురించి తాము చాలా తక్కువగా మాట్లాడుకుంటామన్నారు. ఆధ్యాత్మిక విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తాయన్నారు. ఈ టాపిక్కే తామీ సినిమా చేయడానికి కారణమన్నారు.

వెంకటేష్ తో కలిసి చాలాసార్లు సినిమా చేయాలనుకున్నా ఇప్పటికి కుదిరిందన్నారు. చాలా భయంతో భగవంతుడి పాత్ర చేశానని అన్నారు. ఏమైనా పొరపాట్లు చేసివుంటే క్షమించాలని పవన్ కళ్యాణ్ కోరారు.

'ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా'

దేవుడంటే తనకు చాలా భయమని హీరో పవన్ కళ్యాణ్ చెప్పారు. తాను నమ్మే దేవుడికి ఆకారం లేదని, నిరాకారుడైన దేవున్ని సంపూర్తిగా నమ్ముతానని వెల్లడించారు. శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన 'గోపాల గోపాల' సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

పవన్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
'చిన్నప్పటి నుంచి ఏమవ్వాలో తెలిసేదికాదు. చదవు పెద్దగా చదవలేదు. ఏమయ్యాలో తెలియక నేను, నా స్నేహితుడు ఆనందసాయి శ్రీశైలం అడువుల్లోకి పారిపోదామనుకున్నాం. అప్పుడే హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మన్నారు. సాయిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ధ్యానం, యోగ నేర్చుకున్నాను, అందులోపడి మొత్తం బాధ్యతలు వదిలేశాను.

ఇంట్లో అన్నయ్యకు కథలు చెబుతుండేవాడిని. సంపాదించే అన్నయ్య, అమర్చిపెట్టే వదిన ఉంటే ఎన్నికథలైనా చెబుతావని అన్నయ్య అన్నారు. అన్నయ్య అన్న మాటలతో చెంపమీద కొట్టినట్టయింది. అన్నయ్య పడిన కష్టం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసొచ్చింది. ఖుషీ సినిమా రేపు రిలీజ్ అనగా రాబోయే కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉంటాయని నాకు మనసులో అనిపించింది. అది తర్వాత నిజమైంది. దేవుణ్ని ఎప్పుడు ఏమీ కోరలేదు. జీవితంలో మొదటిసారి అభిమానుల కోసం ఒక కోరిక కోరాను.

ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా.. బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నా అంటూ ఒక అభిమాని నాతో అన్నాడు. అప్పుడు ఒక్క హిట్ ఇమ్మని దేవుణ్ని కోరుకున్నా. మొట్టమొదటిసారి విజయం కోసం ప్రార్థించా. నా మొర ఆలకించి భగవంతుడు హిట్ ఇచ్చాడు. అన్నివదిలేసి వెళ్లిదామనుకున్న సమయంలో నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇలా నిలిపాడు. చాలా భయంతో ఈ సినిమాలో భగవంతుడి కేరెక్టర్ చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి' అని పవన్ కళ్యాణ్ అన్నారు.

హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి....

పులి సినిమా షూటింగ్ ని మంచి ఎంజాయి చేస్తున్నానని ప్రముఖ నటి శ్రీదేవి తెలిపారు. చిత్రంలోని నటీ నటులు, సాంకేతిక బృందంతో కలసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మేరకు ఆదివారం శ్రీదేవి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ హాన్సికాకు తల్లిగా శ్రీదేవి నటిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ శ్రీదేవి తమిళ చిత్ర సీమలో అడుగుపెట్టారు.  ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు.
అలాగే శృతీ హాసన్, సుదీప్ కూడా నటిస్తున్నారు. దాదాపు నాలుగేళ్ల వయస్సులో బాలనటిగా చిత్రసీమలోకి అడుగు పెట్టిన శ్రీదేవి... తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించారు. ఇంగ్లీషు వింగ్లీషు చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ లో  సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అల్లు అర్జున్...?

శేఖర్ కమ్ముల ఇప్పటివరకు పెద్ద హీరోలతో సినిమా చేయలేదు. తాజాగా ఆయన అల్లు అర్జున్‌తో సినిమాకు సన్నాహాలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, సరికొత్త పాయింట్‌తో శేఖర్‌కమ్ముల చెప్పిన కథ నచ్చడంతో అల్లు అర్జున్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఫిల్మ్‌నగర్ వర్గాలు అంటున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని త్వరలో వెల్లడించనున్నారు. ఈ సంవత్సరాంతంలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. దీనికి సల్మాన్‌ఖాన్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

త్రిష త్వరలో పెళ్లిపీటలెక్కనుంది

అందాల భామ త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతుంది. గత కొంతకాలంగా మీడియాలో త్రిష పెళ్లి ఫై చాల రూమర్స్ వస్తున్నాయి. అయితే వాటి అన్నిటికి త్వరలోనే పుల్ స్టాప్ పెట్టనున్నారు. కొంతకాలంగా బిజినెస్‌మేన్ – ప్రొడ్యూసర్ అయిన వరుణ్‌ మణియన్‌ ప్రేమలో త్రిష మునిగితేలుతున్న సంగతి తెలిసిందే.. కోరుకున్న ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు హీరోయిన్ త్రిష రెడీ అయ్యింది. మార్చిలో వరుణ్‌తో త్రిష వివాహం చేయాలని ఇరుకుటుంబాల పెద్దలు కూడా నిర్ణయించినట్లు కోలీవుడ్ సమాచారం.కొద్దిరోజుల కిందట వీళ్లిద్దరి నిశ్చితార్థంపై రకరకాలుగా వార్తలొచ్చాయి. ప్రస్తుతం త్రిష వయస్సు 31 ఏళ్ళు. తెలుగు లో తాజాగా బాలకృష్ణతో ‘లయన్’ చిత్రం, తమిళంలో మరో చిత్రం చేస్తోంది. ఈ రెండూ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

‘పందెం కోళ్ళు’ గా ధనుష్ నేషనల్ అవార్డు ఆడుకలం’ సినిమా

‘వేలఇల్లా పట్టదారి’ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ సినిమా జనవరి 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో తెలుగులో ధనుష్ కి వచ్చిన ఈ కొత్త క్రేజ్ ని వాడుకుంటూ ధనుష్ మరో హిట్ సినిమాని తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నాడు నిర్మాత కిషోర్ కుమార్ రెడ్డి.
2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘ఆడుకలం’ సినిమాని తెలుగులో ‘పందెం కోళ్ళు’ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పందెం కోళ్ళు సినిమా కోళ్ళ పందెంల నేపధ్యంలో ఒక రూరల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ మరియు స్పెషల్ జ్యూరీ నేషనల్ అవార్డులు లభించాయి. ఈ సినిమాతో తమిళంలో తాప్సీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జనవరి చివర్లోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

కలల రాకుమారుడు ఇంకా తారసపడలేదట.....

అందాల భామ కాజల్ అగర్వాల్ తన కలల రాకుమారుడిని ఇంకా కలవలేదని, తన ట్రావెల్ లో అలాంటి వారు ఇంకా తారసపడలేదని అంటోంది. చాలా రోజులుగా కాజల్ అగర్వాల్ తన లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పిన మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ నిజం కాదని తన కలల రాకుమారుడు ఇంకా తారసపడలేదని అంటోంది. ‘నేను ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి చేసుకోనున్నానని వార్తలు వస్తున్నాయి. కానీ అందులో అస్సలు నిజం లేదు. నేను హీరోయిన్ గా బిజీగా ఉన్నాను. ఈ సంవత్సరం కూడా బిజీ బిజీగా ఉండనున్నాను. ఇలాంటి టైంలో నేను లవ్ అండ్ పెళ్ళికి ఎలా సమయం కేటాయించగలను.? లైఫ్ లాంగ్ ఇలా ఒంటరిగానే ఉండలేం.. కావున ఒకరోజు పెళ్లి చేసుకుంటాం.. కానీ ఇప్పుడు కాదు అలాగే నాకు నచ్చిన వ్యక్తి ఇంకా దొరకలేదని’ కాజల్ అంటోంది.
కాజల్ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.

మహేష్ చిత్రంలో పూర్ణ ఐటమ్ సాంగ్

పూర్ణ అల్లరినరేష్ తో ‘సీమటపాకాయ్’లో అలాగే రవిబాబు “అవును” చిత్రం లోను  నటించింది. తెలుగులోనే కాకుండా ఈ భామ తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా బిజీ గానే ఉంది. ఇప్పుడు అసలు ఈమే గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అంటే పూర్ణ  బంపర్ ఆఫర్ కొట్టేసింది. మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట.అ పాటలో లో మహేష్ తో కలిసి స్టెప్పులు వేయనుందట ఆ పాటలో క్లాసికల్ డాన్స్ స్టెప్స్ కూడా ఉంటాయని సమాచారం. పూర్ణ కథక్ నేర్చకుంది. ఆ విషయం తెలిసిన కొరటాల శివ ఈ ఐటమ్ సాంగ్ లో తనని నటింపజేస్తే బాగుంటుందని అనుకున్నాడట. ఇటీవల పూర్ణని సంప్రతించారని వినికిడి. మహేష్ బాబుతో పాట అనగానే పూర్ణ ఎగిరి గంతేసి మరీ ఒప్పేసుకుందట. అయితే, ఈ మధ్య వరుసగా సినిమాలు చేయడంతో కథక్ జోలికి వెళ్లడంలేదట. ఈ పాట కోసం ప్రత్యేకంగా వీలు చేసుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తోందట. వచ్చే నెల ఈ పాట చిత్రీకరణ ఆరంభించనున్నారని సమాచారం.

తెలుగు హీరోల కన్నా సమంత సంపాదన ఎక్కువే.....

తెలుగు సినిమా పరిశ్రమలో సమంత అంటేనే గోల్డెన్ లెగ్ అనే స్థాయికి ఎదిగింది. ఎంతలా ఎదిగిందంటే ఇ అమ్మడు ఏ సినిమాలో నటించినా అది హిట్టే. సినిమాకు సినిమాకు ఏమాత్రం గ్యాప్ లేకుండా అటు కోలీవుడ్ లోను, ఇటు టాలీవుడ్ లోను నటించేస్తూ బాగా బిజీ గా ఉంటూనే పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తూ బిజీ గా మారి పోయింది అమ్మడు. ఇప్పటికే పారగాన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మాజా, లక్స్ ఇలా ఒక్కటేమిటి ఎన్నో బ్రాండ్ లకు అమ్మడు పేరు తెచ్చి పెట్టింది. అదే కోవలో అమ్మడికి  ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. ప్రముఖ బంగారు ఆభరణాల విక్రయదారు జెవెల్ వన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేసే అవకాశం వచ్చింది. ఇందుకు పారితోషికం కాస్త ఎక్కువ చెప్పినా పిల్లకు ఉన్న క్రేజ్ అలాంటిది మరి అని ఓకే అనేసారట. తెలుగు లో చరణ్, బన్నీ లతో సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్న ఈ సుందరి సంపాదన మన తెలుగు హీరోల కన్నా ఎక్కువే అని చెప్పొచ్చు. హీరోల్లో మహేష్ బాబు తో సమానంగా ఆడ్స్  చేస్తున్న తార సమంత ఒక్కతే !

పవర్‌స్టార్ ప్రభంజనం

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ట్విట్టర్‌లోకి వచ్చిన వెంటనే ప్రభంజనం సృష్టిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే ఆయనను 1.28 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అసలే ఇప్పుడు సంక్రాంతి పండుగ ఇక ఇ టైంకు  ఫాలోవర్స్ సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్టు టాక్. ఇక పవన్ ట్విట్టర్‌లోకి రావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పలువురు టాలీవుడ్ తారలు పవన్‌కు స్వాగతం అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.
అయితే పవన్ అభిమానులు పవన్ పొలిటికల్, మూవీ మెసేజ్‌ల కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నట్టు వారు శుభాకాంక్షలు కూడా తెలిపారు.

కార్తీకి జోడీగా శృతిహాసన్

నాగార్జున, కార్తీలతో ‘ఎవడు’ ఫేమ్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న చిత్రంలో కార్తీకి జోడీగా శృతిని ఫైనలైజ్ చేశారు. ఈ విషయాన్ని శృతి ట్వీట్ చేసింది. టాలీవుడ్, బాలీవుడ్ లలో ఐటెం సాంగ్స్ ను సైతం చెప్తూ కెరీర్ లో శృతి ముందుకు దూసుకుపోతున్నది. న్యూ ఇయర్ సందర్భంగా శృతి తన అభిమానులకు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఇచ్చింది. కార్తీతో శృతి నటించడం ఇదే మొదటిసారి. కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు శృతి చెప్పుకొచ్చింది.
అయితే శృతి హాసన్..కార్తి అన్న సూర్యతో ‘సెవెంత్ సెన్స్’ లో జోడీ కట్టినా ఆ సినిమా ఆశించినంత ఫలితాన్నిఇవ్వలేదు.అయితే తెలుగు లో మాత్రం శ్రుతికి ‘గబ్బర్ సింగ్’ సినిమా హిట్ అయ్యేవరకూ ఈ సుందరిని ఐరెన్ లెగ్ హీరోయిన్ గా పిలిచేవారు. కానీ గబ్బర్ సింగ్ హిట్ తో శృతి ఫేట్ మారిపోయింది. అప్పట్నుంచి గోల్డెన్ లెగ్ ట్యాగ్ ను సొంతం చేసుకున్నదీ చిన్నది. రామ్ చరణ్ కి జోడీ గా ‘ఎవడు’ ఫేమ్ వంశీ దర్శకత్వంలో సినిమా చేసింది. ఇప్పుడు కార్తి సరసన హీరోయిన్ గా వంశీపైడిపల్లి దర్శకత్వంలో మళ్ళీ చేస్తున్నది.
ప్రస్తుతం శృతి హాసన్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో మహేష్ సరసన నటిస్తోంది. 2014లో ‘రేస్ గుర్రం’ లాంటి బంపర్ హిట్ ను ఎంజాయ్ చేసిన శృతి 2015 లో హీరోయిన్ గా, ఐటెం గర్లగా కెరీర్ లో ముందుకు వెళ్తుంది. శృతి 2015 లో కూడా మంచి విజయాలను అందుకోవాలి.

అడువుల్లోకి పారిపోదామనుకున్నా

శిల్పాకళావేదికలో ఆదివారం జరిగిన ‘గోపాల గోపాల’ సినిమా ఆవిష్కరణ కార్యక్రమంలో హీరో వెంకటేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాట్లాడారు.

అయన మాటల్లోనే ‘చిన్నప్పటి నుంచి ఏమవ్వాలో తెలిసేదికాదు.  పెద్దగా చదువుకోలేదు . ఏమవ్వాలో తెలియక నేను, నా స్నేహితుడు ఆనందసాయి శ్రీశైలం అడువుల్లోకి పారిపోదామనుకున్నాం. అప్పుడే హైదరాబాద్ నుంచి చిరంజీవి అన్నయ్య ఫోన్ చేశారు. వెంటనే బయలుదేరి హైదరాబాద్ రమ్మని చెప్పారు . మిత్రుడు సాయిని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాను. ధ్యానం, యోగ నేర్చుకున్నాను, అందులోపడి మొత్తం బాధ్యతలు వదిలేశాను.
ఇంట్లో అన్నయ్యకు కథలు చెబుతుండేవాడిని. సంపాదించే అన్నయ్య, అమర్చిపెట్టే వదిన ఉంటే ఎన్నికథలైనా చెబుతావని అన్నయ్య అన్నారు. అన్నయ్య అన్న మాటలతో చెంపమీద కొట్టినట్టయింది. అన్నయ్య పడిన కష్టం సినిమాల్లోకి వచ్చిన తర్వాత నాకు తెలిసొచ్చింది. ఖుషీ సినిమా రేపు రిలీజ్ అనగా రాబోయే కొన్ని సంవత్సరాలు కష్టాలు ఉంటాయని నాకు మనసులో అనిపించింది. అది తర్వాత నిజమైంది. దేవుణ్ని ఎప్పుడు ఏమీ కోరలేదు. జీవితంలో మొదటిసారి అభిమానుల కోసం ఒక కోరిక కోరాను.
ఒక్క హిట్ తీయన్నా.. చచ్చిపోతున్నామన్నా.. బయట తలెత్తుకుని తిరగలేకపోతున్నామన్నా అంటూ ఒక అభిమాని నాతో అన్నాడు. అప్పుడు ఒక్క హిట్ ఇమ్మని దేవుణ్ని కోరుకున్నా. మొట్టమొదటిసారి విజయం కోసం ప్రార్థించా. నా మొర ఆలకించి భగవంతుడు హిట్ ఇచ్చాడు. అన్నివదిలేసి వెళ్లిదామనుకున్న సమయంలో నన్ను సినిమాల్లోకి తీసుకొచ్చాడు. మీ అందరి ముందు ఇలా నిలిపాడు. చాలా భయంతో ఈ సినిమాలో భగవంతుడి కేరెక్టర్ చేశాను. ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించండి’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

Saturday, 3 January 2015

2015 లో అంతా భారీ సినిమాల సందడి

2015లో స్టార్‌ హీరోల సినిమాలు, భారీ బడ్జెట్‌ సినిమాలు రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. అంతేకాదు.. ఈ కొత్త సంవత్సరంలో స్టార్‌ హీరోల వారసులు నటిస్తున్న సినిమాలు కూడా రిలీజ్‌లకు రానున్నాయి. కొత్త సంవత్సరంలో రిలీజవుతున్న తొలి తెలుగు స్ట్రెయిట్‌ భారీ సినిమా గోపాల గోపాల. వెంకటేష్‌, పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్రల్లో నటించారు. జనవరి 14న రిలీజ్‌ ఖరారు చేశారు. అంతకంటే ముందే శంకర్‌, విక్రమ్‌ కలయికలో వస్తున్న
"ఐ" చిత్రం  కన్నుల పండుగ  చేయబోతోంది. పవర్‌ స్టార్‌ పవన్‌కల్యాణ్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి గబ్బర్‌సింగ్‌ 2 ని తెరకెక్కిస్తున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రథమార్థంలోనే రిలీజవుతుందని సమాచారం.

మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శ్రీమంతుడు వేసవిలో బరిలోకి వస్తుంది. ఇదే ఏడాది జనవరి చివరిలో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న టెంపర్‌, కళ్యాణ్‌రామ్‌ పటాస్‌ రిలీజ్‌లకు రెడీ అవుతున్నాయి. అలాగే ఎన్టీఆర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో కొత్త సినిమా మొదలై, ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్‌కి సన్నద్దం చేయనున్నారు. బన్నిత్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాని వేసవి సెలవుల నాటికి సిద్ధం చేస్తారని సమాచారం. రామ్‌చరణ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా త్వరలో మొదలవుతోంది. 2015 రిలీజుల్లో ఇదో భారీ బడ్జెట్‌ సినిమా. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సత్యదేవ్‌ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న భారీ చిత్రం కొత్త సంవత్సరం ప్రథమార్థంలోనే రిలీజ్‌ కానుంది.ఈ చిత్రానికి వారియర్‌, లయన్‌ టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయి. అలాగే నాగార్జున హీరోగా కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోగ్గాడే చిన్నినాయనా వేసవి సెలవుల్లోనే రిలీజవుతుంది. అక్కినేని నటవారసుడు అఖిల్‌ హీరోగా వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం 2015 ప్రథమార్థం చివరిలో రిలీజవుతుంది. ఈలోగానే నాగచైతన్య హీరోగా సుధీర్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దోచెయ్‌ రిలీజవుతుంది.

2015లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాలివే:

2015లో ఎన్ని భారీ సినిమాలు రిలీజైనా ఓ రెండు సినిమాల గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగాల్సిందే. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాహుబలి పార్ట్‌ 1 కొత్త సంవత్సరంలో వేసవి సెలవులకు రిలీజవుతోంది. ఈ సంగతిని ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా లాంటి స్టార్లు ఈ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే అనుష్క టైటిల్‌ పాత్రలో నటిస్తున్న రుద్రమదేవి 3డి చిత్రాన్ని గుణశేఖర్‌ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా స్టీరియోస్కోపిక్‌ 3డి విధానంలో తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్‌రామ్‌ ఓం 3డి తర్వాత తెలుగులో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మోక 3డి చిత్రమిదే. ఈ సినిమాని జనవరి చివరిలో లేదా ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయనున్నారని సమాచారం. ఇవి రెండూ రొటీన్‌ మూస సినిమాలకు దూరంగా తెరకెక్కుతున్న చిత్రాలు. పైగా భారీ బడ్జెట్‌లతో తెరకెక్కుతున్నాయి. యూనివర్శల్‌ అప్పీల్‌ ఉన్న చిత్రాలు. అందుకనే ప్రపంచం మొత్తంలో ఉన్న ఫిలింమేకర్స్‌ కళ్లు ఈ సినిమాల వివరాల కోసం గూగుల్‌లో వెతుకుతున్నాయి.