Sunday 4 January 2015

‘పందెం కోళ్ళు’ గా ధనుష్ నేషనల్ అవార్డు ఆడుకలం’ సినిమా

‘వేలఇల్లా పట్టదారి’ సినిమాకి డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన ధనుష్ ‘రఘువరన్ బిటెక్’ సినిమా జనవరి 1న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమాకి యువత నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతో తెలుగులో ధనుష్ కి వచ్చిన ఈ కొత్త క్రేజ్ ని వాడుకుంటూ ధనుష్ మరో హిట్ సినిమాని తెలుగులోకి అనువదించే పనిలో ఉన్నాడు నిర్మాత కిషోర్ కుమార్ రెడ్డి.
2011లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు గెలుచుకున్న ‘ఆడుకలం’ సినిమాని తెలుగులో ‘పందెం కోళ్ళు’ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. పందెం కోళ్ళు సినిమా కోళ్ళ పందెంల నేపధ్యంలో ఒక రూరల్ ఏరియా బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఈ సినిమాకి బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ మరియు స్పెషల్ జ్యూరీ నేషనల్ అవార్డులు లభించాయి. ఈ సినిమాతో తమిళంలో తాప్సీ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. జనవరి చివర్లోనే ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

0 comments:

Post a Comment