Friday, 19 September 2014

శంకర్ ఎందిరన్-2 (రోబో)ను తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం

స్టార్ దర్శకుడు శంకర్ ఎందిరన్-2 (రోబో)ను తెరకెక్కించే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. విక్రమ్ హీరోగా ‘ఐ’ చిత్రాన్ని పూర్తి చేసిన శంకర్ ఇక తన దృష్టిని ఎందిరన్‌కు సీక్వెల్‌ను తెరకెక్కించడంపై సారిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నాయకుడి (శాస్త్రవేత్త)గా, రోబో (ప్రతినాయకుడు)గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఎందిరన్. సౌందర్యరాశి ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శంకర్ హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని విధంగా చిత్రీకరించారు.

చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి రెండవ భాగాన్ని తెరపై ఆవిష్కరించడానికి శంకర్ సిద్ధమైనట్లు సమాచారం. ఆయన దీనికి కథను కూడా సిద్ధం చేశారట. ఇప్పటికే ఈ చిత్రంలో నటించడానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపికలో నిమగ్నమయ్యారని సమాచారం. రజనీకాంత్‌కు తాను నటిస్తున్న లింగా చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఎందిరన్ - 2 కోసం తనను తాను రెడీ చేసుకుంటున్నారట.

0 comments:

Post a Comment