Friday, 19 September 2014

రణ్ బీర్ ను తన జీవితంలోనే ప్రముఖ వ్యక్తిగా పేర్కొన్న కత్రీనా....

బాలీవుడ్ నటుడు రణ్ బీర్ కపూర్ తన జీవితంలో ఎప్పటికీ ప్రముఖమైన వ్యక్తి అంటోంది అందాల భామ కత్రీనా కైఫ్. గత సంవత్సరం ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు కూడా బాగానే హల్ చల్ చేశాయి. అయితే అటువంటి ఆలోచనే లేదంటోంది కత్రీనా.  రణ్ బీర్ ను తన జీవితంలోనే ప్రముఖ వ్యక్తిగా పేర్కొన్న ఈ నటి..పెళ్లి వార్తలను మాత్రం ఖండించింది. ఇప్పటి వరకూ అటువంటి ఆలోచనే లేదంటూ వయ్యారాలు ఒలగబోస్తోంది. ప్రస్తుతం 'బేంగ్ బేంగ్' చిత్రంతో బిజీగా ఉన్న కత్రీనా తనకు కెరీరే ప్రధానం అంటోంది.

రణ్ బీర్ తో సాన్నిహిత్యం గురించి అడిగిన ప్రశ్నకు మాత్రం.. అతని తన జీవితంలోనే గొప్ప వ్యక్తిగా అభివర్ణించింది. ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ తో దగ్గరగా ఉంటున్న కత్రీనా.. అతని కుటుంబంపై ప్రేమను కురిపించింది. సల్మాన్ ఫ్యామిలీ సభ్యులు తనతో చాలా బాగుంటారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. ఈ సాన్నిహిత్యం ఇలానే ఉండాలని ఆమె ఆశిస్తోంది.

0 comments:

Post a Comment