తెలుగుపోస్టర్ రేటింగ్ : 3/5
‘దూకుడు’ తర్వాత శ్రీనువైట్ల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కూడా మహేష్ బాబు సరికొత్త గెటప్ తో కనిపించాడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబుతో చేస్తున్న 3వ సినిమా ‘ఆగడు’. మొదటిసారి మహేష్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించింది , శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేసింది. . భారీ అంచనాల నడుమ సుమారు 200కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకొని, బాక్స్ ఆఫీసు వద్ద ఆగడు ఆగకుండా దూసుకుపోతూ ‘దూకుడు’ రికార్డ్స్ ని బద్దలు కొడుతుందా.? లేదా.? అనేది ఇప్పుడు చూద్దాం….
కథ :
అనాధ అయిన శంకర్ (మహేష్ బాబు) ను రాజ నరసింగరావు(రాజేంద్ర ప్రసాద్) అనే పోలీస్ ఆఫీసర్ అతన్ని చేరదీసి పోలీస్ చెయ్యాలనుకుంటాడు. ఈ శంకర్ చాలా తెలివైన కుర్రాడు. కానీ అనుకోని సంఘటన వాళ్ళ చేయని తప్పును నెత్తిన వేసుకొని జైలుకు వెళతాడు. అక్కడే శంకర్ బోస్టన్ స్కూల్ లో చదివి పోలీస్ అవుతాడు.. అప్పుడే బుక్క పట్టణంలో దామోదర్ (సోనూ సూద్) చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి శంకర్ ని బుక్క పట్టణం సిఐగా పంపిస్తాడు.. అక్కడికి వచ్చిన శంకర్ కి ఓ నిజం తెలుస్తుంది. తను అన్నయ్య లా భావించే రాజారాం కొడుకు దామోదర్ వాళ్ళ మరణించాడని తెలుసుకున్న శంకర్ దామోదర్ ఆగడాలను ఎలా అడ్డుకున్నాడు.? అలాగే శంకర్ చేసిన మర్డర్ వెనకున్న నిజా నిజాలేమిటి? అనేది మీరు తెరపైనే చూడాలి…
ప్లస్ పాయింట్స్ :
మహేష్ బాబు ఈ సినిమాలో కూడా సరికొత్త యాటిట్యూడ్, మానరిజమ్స్ తో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాడు.
ముఖ్యంగా హీరో ఇంట్రడక్షన్, టైటిల్ సాంగ్ చాలా బాగుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా చాలా బాగుంది.
మహేష్ బాబు ఈ సినిమాలో మాట్లాడిన రాయలసీమ యాస డైలాగ్స్ బాగా పేలడమే కాకుండా, ఆడియన్స్ ని థియేటర్లో కంటిన్యూగా విజిల్స్ కొట్టేలా చేసాయి.
మొదటిసారి మహేష్ తో జోడీ కట్టిన తమన్నాకి ఉన్నది చిన్న పాత్రే అయినా ఉన్నంత సేపూ మాత్రం ఆడియన్స్ తనవైపు తిప్పుకుంది. లంగా వోనీలో కుర్రకారుని ఆకట్టుకుంది. సీన్స్ లో లంగా వోనీలో కనిపించే తమన్నా పాటల్లో మాత్రం టోటల్ గ్లామరస్ లుక్ లో అందాలు ఆరబోసి బి, సి సెంటర్ ఆడియన్స్ ని మెప్పించింది.
కామెడీ కింగ్, తన బట్ట – పొట్టతోనే నవ్వించగల బ్రహ్మానందం బ్రోకర్ పాత్రలో బాగానే నవ్వించాడు. బ్రహ్మానందంకి రాసిన కొన్ని ప్రాసతో కూడిన పంచ్ డైలాగ్స్ బాగానే పేలాయి. మహేష్ సినిమాలో కంటిన్యూగా కీ రోల్స్ చేస్తున్న నాజర్ కి ఈ మూవీలో ఓ డిఫరెంట్ రోల్ చేసాడు. ఈ పాత్ర ద్వారా నాజర్ వేసే వెటకారపు సెటైరికల్ డైలాగ్స్ బాగా పేలడంతో థియేటర్లో నవ్వుల జల్లులు కురిశాయి.
వెన్నెల కిషోర్ కూడా సినిమా మొత్తం మహేష్ తో ట్రావెల్ అవుతూ నవ్వించాడు. పోసాని డైలాగ్ డెలివరీ అంటేనే నవ్వు ఆపుకోలెం, ఈ సినిమాలో పోసానికి రాసిన పంచ్ డైలాగ్స్ కూడా బాగానే నవ్వించాయి.
మైనస్ పాయింట్స్ :
మైనస్ పాయింట్స్ అంటే అనే సినిమా కథ – కథనం. కథలో చెప్పుకోదగిన పాయింట్ లేకపోవడం. ఇలాంటి కథలతో వచ్చిన చాలా సినిమాలను మనం ఇది వరకే చూసేయడం. పోనీ కథ పాతదే, చాలా సినిమాలను స్పూర్తిగా తీసుకొని రాసుకున్నారు.
సినిమాలో ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు ఏమేమి జరుగుతుందనేది ముందే ఊహించేయవచ్చు. అన్నికంటే మించి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సెకండాఫ్ యాసిటీజ్ ‘దూకుడు’ లానే ఉంది కదా అని పెదవి విరుస్తున్నారు.
ఇకపోతే బ్రహ్మానందం కామెడీ కూడా చాలా చోట్ల వర్కౌట్ అవ్వలేదు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో సిజి లో వేయించిన డాన్స్ స్టెప్స్. అలాగే శీను – పోసాని – రఘుబాబులతో చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు సీక్వెన్స్ కూడా నవ్వించలేకపోయింది. ఫైనల్ గా ఈ సినిమా నిడివి కూడా చాలా ఎక్కువ కావడం ఈ సినిమాకి మైనస్.
తీర్పు :
చాలా కాలం నుంచి టాలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న మహేష్ బాబు క్రేజీ ప్రాజెక్ట్ ‘ఆగడు’. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ ‘ఆగడు’ ఆ రేంజ్ అంచనాలను అందుకోలేకపోవడంలో కొంతవరకూ విఫలమైంది కానీ కామెడీ పరంగా మాత్రం సక్సెస్ అని చెప్పవచ్చు ఎందుకంటే బోర్ లేకుండా కామెడీగా స్టొరీ నడిపించాడు శ్రీనువైట్ల. సినిమా చూసి ఆనందించండి .
ప్రస్తుతం ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించే పెద్ద హీరోల సినిమాలు ఏమీ లేకపోవడం వలన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా స్ట్రాంగ్ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది…
0 comments:
Post a Comment