Thursday, 18 September 2014

సంక్రాంతికి సోలోగా గోపాల గోపాల....

ప్రతిసారీ సంక్రాంతి పండుగను మహేష్‌, చరణ్‌ ఏలేసేవారు. కానీ ఈసారి ఇద్దరికీ ఆ ఛాన్‌‌స లేదు. ఈ ఇద్దరూ దసరా పండుగకి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్‌లోనే పోటీపడతారు. అయితే మరి సంక్రాంతి బరిలో పోటీపడే హీరోలెవరు? అని ఆరాతీస్తే .. ఒకే ఒక్క సినిమా మాత్రమే గొబ్బెమ్మల పండక్కి రిలీజవుతోందని అర్థమవుతోంది. పవన్‌కల్యాణ్‌, వెంకటేష్‌ హీరోలుగా `గోపాల గోపాల' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో రిలీజవుతున్న ఏకైక పెద్ద సినిమా. వాస్తవానికి ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `నేనోరకం' రిలీజవుతుందని భావించారు. కానీ ఆ ప్రాజెక్టు సంక్రాంతి నాటికి పూర్తి కావడం కష్టమేనని అంటున్నారు. ఇటీవలే పూరీ కేవ్‌లో మొదలైన ఈ సినిమా కొంత షెడ్యూల్‌ చిత్రీకరణ తర్వాత వాయిదా వేశారు. ఎన్టీఆర్‌ స్క్రిప్టు పరంగా కొన్ని మార్పులు చెప్పారని అందుకే వాయిదా పడిందని సమాచారం. ఆ మేరకు షెడ్యూల్‌‌స అనుకున్న టైమ్‌లో పూర్తి కావు కాబట్టి సంక్రాంతికి బాద్‌షా సినిమా లేనట్టే. ఆ రకంగా పవన్‌, వెంకీ నటించిన `గోపాల గోపాల' ఒక్కటే సోలోగా రిలీజవుతుంది. పవర్‌స్టార్‌ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ వద్ద మరో 100 కోట్ల మ్యాజిక్‌

0 comments:

Post a Comment