Thursday, 18 September 2014

‘పీకే’ శాటిలైట్‌ హక్కులు రూ.85 కోట్లు

అమీర్‌ఖాన్‌ నటిస్తున్న తాజా చిత్రం పీకే. త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ప్రమోషన్‌లో భాగంగా విడుదల చేసిన మూడు పోస్టర్లు సంచలనాన్ని సృష్టించడమే కాకుండా సినిమాపై భారీ అంచనాల్ని పెంచేశాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు బాలీవుడ్‌ చిత్రాలు పోస్ట్‌పోన్‌ అయిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా బాలీవుడ్‌లో సినిమా విడుదలయ్యాకే శాటిలైట్‌ మార్కెట్‌ మొదలవుతుంది. కానీ ‘పీకె’ విషయంలో అది తారుమారయింది. విడుదలకు ముందే ఈ సినిమా రూ.85 కోట్ల శాటిలైట్‌ బిజినెస్‌ చేసిందని, ఓవరాల్‌గా రూ.300 కోట్ల బిజినెస్‌ జరిగిందని బాలీవుడ్‌ వర్గాల అంచనా. సల్మాన్‌ఖాన్‌ ‘కిక్‌’ సినిమా కూడా విడుదలకు ముందే భారీగా శాటిలైట్‌ రైట్స్‌ను పొందిన విషయం తెలిసిందే. ‘పీకే’ సినిమాతో అమీర్‌ మరోసారి బాక్సాఫీస్‌ వద్ద తన సత్తాను చాటుకోనున్నాడని ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు.

0 comments:

Post a Comment