అందాలరాశి హన్సిక తన అందచం దాలు, గ్లామర్‌తో పలు సినిమాల్లో ప్రేక్షకులను
కనువిందు చేసింది. ఈ భామ అప్పుడప్పుడు కాస్త నాటీ వేషాలు కూడా
వేస్తుంటుంది. మొన్నటికి మొన్న ఓ సినిమాలో లుంగీ డ్యాన్స్ వేసి అలరించిన
హన్సిక ఇప్పుడిలా ఊరమాస్ మొగుడిలో తయారైంది. త్వరలోనే తమిళంలో జయంరవి అనే
హీరోతో ఓ సినిమాలో రానుంది. ఇందులో హన్సిక హీరోయిన్. ఇక్కడ ప్రేమికుడిని
డామినేట్ చేసే పాత్రలో ఈ ప్రియురాలు మనల్సి అలరిస్తుందట. ఈ సినిమాలో
హాట్‌హాట్‌గా కనువిందుచేయబోతుందట ఈ సుందరాంగి. హన్సిక కెరీర్‌లో ఈ చిత్రం ఓ
మైలురాయిగా నిలుస్తుందని ఫిల్మ్‌మేకర్స్ అంటున్నారు. తమ సినిమాలో
సరికొత్త హన్సికను చూస్తారంటున్నారు. దక్షిణాదిన ముఖ్యంగా కోలీవుడ్‌లో
హన్సికకు హీరోయిన్‌గా మంచి పాపులారిటీ ఉంది. జూనియర్ ఖుష్బూగా అభిమానులు
ఆమెను కీర్తిస్తారు. ఈ నేపథ్యంలో హన్సిక తెలుగు సినిమాల కంటే తమిళ
చిత్రాలకే అధిక ప్రాధాన్యతనిస్తోంది. అక్కడ తనపై ఉన్న క్రేజ్‌ను క్యాష్
చేసుకోవడానికే తమిళ సినిమాల్లో ఈ భామ ఎక్కువగా నటిస్తోందన్న మాటలు
వినిపిస్తున్నాయి. హన్సిక చేస్తున్న సినిమాలు చూస్తే ఇది నిజమేన
నిపిస్తుంది. ఈ విషయలో హన్సిక మాట్లాడుతూ తాను తెలుగు సినిమాలను వదులుకునే
ప్రసక్తేలేదంది.
0 comments:
Post a Comment