ప్రస్తుతం ఇండియాలో ఉన్న బెస్ట్ డ్యాన్సింగ్ హీరో ఎవరని పోల్ పెడితే ..
అందులో ఖచ్చితంగా హృతిక్‌రోషనే విజేతగా నిలుస్తాడు. సౌత్‌లో ముఖ్యంగా మన
టాలీవుడ్‌లో మంచి డ్యాన్సర్లున్నప్పటికీ హృతిక్ డ్యాన్స్ లో ఉండే రిథమ్
మరెవరిలోనూ కనిపించదన్నది వాస్తవం. మన హీరోల్లా డ్యాన్స్‌పై అంత
దృష్టిపెట్టడు కానీ...అతను మనసుపెట్టి స్టెప్పులేస్తే థియే టర్లు
ఊగిపోతాయి. తొలి సినిమా కహోనా ప్యార్ హైలో హృతిక్‌రోషన్ డ్యాన్సులకు ఫిదా
అయిపోయి అతడి ప్రేమలో పడిపోయిన అమ్మాయిలు లక్షల్లో ఉన్నారు. ధూమ్-2,
క్రిష్-2 సినిమాల్లోనూ ఈ కండలవీరుడు తన డ్యాన్సింగ్ టాలెంట్
చూపించాడు. అయితే హృతిక్ తన స్టెప్పుల తో అభిమానులకు కిక్‌ఇచ్చి చాలా
కాలం అయింది. అభిమానులు ఇంకెం తో కాలం ఎదురుచూడకుండా 'బ్యాంగ్ బ్యాంగ్‌లో
అదిరిపోయే స్టెప్పులతో సిద్ధమైవస్తున్నాడు హృతిక్. ఇందులో దాదాపుగా
ప్రతి పాటలోనూ హృతిక్ పాదాలు షేకైపోతాయని..ముఖ్యంగా ఓ పాటలో ఈ హీరో...
మైకేల్‌జాక్సన్‌ను గుర్తుకు తేబోతున్నాడని అంటున్నాయి ఈ సినిమా వర్గాలు.
బ్యాంగ్ బ్యాంగ్ అంటూ సాగే ఈ పాటలో జాక్సన్ మూన్‌వాక్ స్టెప్పును
హృతిక్ తనదైన శైలిలో చేశాడని..ఆ స్టెప్పుకు థియేటర్లు హోరె త్తిపోతాయని
అంటున్నారు. నిజంగా ఈ స్టెప్పులకు అంత సీనుందో లేదో 'బ్యాంగ్ బ్యాంగ్
సినిమా విడుదలైన తర్వాత చూడాల్సిందే.
0 comments:
Post a Comment