Sunday 5 October 2014

అరుణతో 'ఆది' నిశ్చితార్థం

ప్రేమ వివాహమో.. పెద్దలు కుదిర్చిన పెళ్లో తెలియదు గానీ, ఆది నిశ్చితార్థం మాత్రం విజయదశమి పర్వదినం రోజున హైదరాబాద్ లో జరిగింది. అరుణ అనే యువతిని ఆది పెళ్లి చేసుకోబోతున్నాడు. చాలా పరిమిత సంఖ్యలో వచ్చిన బంధుమిత్రుల మధ్య ఆది నిశ్చితార్థం జరిగింది. కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు.

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడిగా, పీజే శర్మ మనవడిగా టాలీవుడ్ లో 'ప్రేమ కావాలి' చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆది.. ఇటీవల విడుదలైన గాలిపటం సినిమాతో సక్సెస్ కూడా చూశాడు. త్వరలోనే అతడు నటించిన రఫ్ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పుడు మళ్లీ గరమ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫైట్లు, డాన్సులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరవడి సృష్టించుకున్న ఆది.. ఇప్పుడు పెళ్లికొడుకుగా సరికొత్త పాత్ర పోషించబోతున్నాడు.

0 comments:

Post a Comment