Wednesday 1 October 2014

సిద్ధమైన 'కరెంట్‌ తీగ'

'కరెంట్‌ తీగ ఆడియో ఆల్బమ్‌ వయోభేదంలేకుండా జనాలందరినీ ఉర్రూతలూగిస్తోంది . అచ్చు సంగీత సారధ్యంలో రూపొందిన  ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశే షంగా అలరిస్తూ నెం.1 చార్ట్‌బస్టర్‌ గా  నిలిచాయి. ముఖ్యంగా చిత్ర కథానాయకుడు మంచుమనోజ్‌ స్వయంగా పాడిన దేవదాస్‌ బ్రేకప్‌ సాంగ్‌  ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువకులందరి  నోళ్లలో నాను తోంది. సోషల్‌ మీడియాలో సైతం లక్షల లైకులు,షేర్లతో 'కరెంట్‌ తీగ ఆడియోవిజయపథంలో సాగుతోంది.  అక్టోబర్‌ మూడవ వారంలో  ప్రపంచవ్యాప్తంగా  విడుదలకానున్న 'కరెంట్‌ తీగ  చిత్రానికి ఆడియో మెయిన్‌హైలైట్‌గా నిలుస్తుందని చిత్రబృందం ఆనందం వ్యక్తంచే స్తోంది. పద్మశ్రీ  డా.మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ సరసన అందాలభామలు రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సన్నీలియాన్‌ కథానాయి కలుగా కనువిందుచేయనున్నారు.

0 comments:

Post a Comment