Wednesday 1 October 2014

గ్లామర్ లేకపోతె అది కళాత్మకంగా ఉండదు....

సినిమాలలో పాత్రలను , నిజ జీవితంలో వ్యక్తిత్వాన్ని పోల్చవద్దు అని అంటున్నది కత్రినా కైఫ్. తెరపై ఏది చేసిన , ఏది చూపించిన అది అంతా కళలో భాగమే అంటూ ఓ ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చింది. మొదటి సినిమా నుంచి కత్రినా ఏ సినిమాలోనూ ఎక్స్ పోజింగ్ లో హద్దులు దాటేసినా అదంతా కళాత్మకంగా ఉండేందుకే అని చెప్పిన ఈమె తాజాగా బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలోనూ హద్దులు దాటేసి మరీ అందాల విందు చేసింది.

ఈ విషయమై హద్దులు దాటి అందలు ఆరబోస్తే మిమ్మల్ని అభిమానించే వారు కొందరు హార్ట్ అవుతారు కదా అని ఇన్డైరెక్ట్ గా ఆమె ప్రియుడిని ఉద్దేశించి అడిగితె ‘అది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ…దాన్ని కళగానే చూడాలి’ అని సమాధానం ఇచ్చింది. అంతేకాక ‘నేను కెరీర్ ప్రారంభంలో సరిగ్గా డాన్స్ చేయలేకపోయా…ఇప్పుడు డాన్స్ లో రాణిస్తున్నా…డాన్సుల్లో స్టైలిష్ ప్రెజెంటేషన్ కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఫిజిక్ ని పర్ఫెక్ట్ గా ఉంచుకోవడం ముఖ్యం. దాంతో పాటు కొన్ని డ్రెస్సులు కొన్ని డాన్సులకు సూటవుతాయి…పాటలకు తగ్గట్లుగా గ్లామర్ లేకపోతె అది కళాత్మకంగా ఉండదు కదా’ అంటున్న కత్రినా , గ్లామర్ విషయంలో ఎన్ని విమర్శలోచినా , తనకంటూ గ్లామర్ పై కచ్చితమైన అవగాహనా ఉన్నది.

0 comments:

Post a Comment