Thursday, 23 October 2014

‘కార్తికేయ’ కమర్షియల్ గా విజయం సాధిస్తుందా ?

ఆంధ్ర – తమిళనాడు బార్డర్లో ఒక టెంపుల్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్ కథలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం కానున్నారు. యంగ్ హీరో నిఖిల్, స్వాతి జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ’. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ చూసి ప్రముక దర్శకుడు రాజమౌళి భాగుందని చెప్పడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి.అంతే కాకుండా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి కమర్షియల్ గా కూడా తనే కెరీర్ బెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుందని నిఖిల్ ఆశిస్తున్నాడు. మరి నిఖిల్ అనుకున్నది జరుగుతుందా లేదా అని తెలియడానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తమిళంలో కూడా రూపొందిన ఈ సినిమా తమిళ వెర్షన్ ని నవంబర్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
నిఖిల్ కెరీర్లోనే అత్యధికంగా సుమారు 250కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే కాకుండా యుఎస్ లో కూడా ఈ సినిమా సుమారు 36 లోకేషన్స్ లో రిలీజ్ చేస్తారు.కాబట్టి ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాదిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే ...

0 comments:

Post a Comment