Wednesday 10 September 2014

పాపికొండల మధ్య రోప్ వే

ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో సిరివాక గ్రామంలో పాపికొండలను కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కాగా పాపికొండల మధ్య అందంగా గోదావరి నది పాయ ప్రవహిస్తూ ఎంతో ఆహ్లాదకరంగా చూపరులను ఆకర్షిస్తుంది. ఈ నేపధ్యంగా రెండు కొండల మధ్య 300మీటర్ల మేరకు సిరివాక గ్రామంలో రోప్ వే ఏర్పాటును చెయ్యాలని అటవీశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా రోప్ వే నిర్మాణంలో 1.5 నుండి 2కిలోమీటర్ల దూరంలో పోల్స్ ను ఏర్పాటు చెయ్యాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే రెండు రోప్ వేలను సమాంతరంగా ఏర్పాటు చెయ్యాల్సిందిగా వీరు పేర్కొంటున్నారు. ఇక పాపికొండ నేషనల్ పార్క్ పైన ఈ రోప్ వేలు ఏర్పాటు చెయ్యబోతుండడంతో పర్యాటకులు అటు గోదావరి అందాలను, ఇటు జంతు, జీవరాసులను చూసి ఆనందించడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణం త్వరితంగా పూర్తికావాలని ఎందరో పర్యాటక ప్రియులు ఎదురుచూస్తున్నారు.

0 comments:

Post a Comment