Friday 12 September 2014

పవర్ : ర్రివ్యూ



తెలుగు పోస్టర్ రేటింగ్ : 2.75/5

బలుపు సినిమాకు కధను అందించిన బాబినే దర్శకుడిగా ఎంచుకుని చేసిన ఈ సినిమాలో రవితేజ విక్రమార్కుడు అనంతరం మరోసారి పవర్ఫుల్ పోలీసాఫీసర్గా నటించాడు. పోలీస్ పాత్రలో జీవించడం రవితేజకి కోతేమి కాదు.కానీ ట్రైలర్ అదిరిపోయే లెవెల్ లో ఉండటంతో తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా ఏర్పడి పవర్ సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి. పవర్ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం. హన్సిక, రెజీనాలతో కలిసి రవితేజ, బాబీలు పవర్ చూపించారా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.


అవినీతి పోలీస్ ఆఫీసరైన బలదేవ్ సహాయ్(రవితేజ) ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటాడు. హోంమంత్రి జయవర్ధనే (ముఖేశ్ రుషి) సోదరుడు గంగూలీ భాయ్(సంపత్)ని తప్పించే క్రమంలో బలదేవ్ సహాయ్ చనిపోతాడు. అప్పుడు అదే పోలికలతో ఉన్న తిరుపతి (రవితేజ)ను ఒక టీవీ ఛానల్ లో చుసిన హోం మంత్రి జయవర్దనే బలదేవ్ సహాయ్ పాత్రలో తిరుపతిని  ప్రవేశపెడుతాడు. అయితే హోంమంత్రికి బలదేవ్ తన  పని ముగియగానే తిరుపతిని కాల్చేస్తాడు అప్పుడు స్నేహితుల సహాయంతో బయటపడ్డ తిరుపతి బలదేవ్ సహాయ్ పాత్రలో ప్రవేశించి ఏలాంటి గందరగోళం సృష్టించాడు? అవినీతి పోలీస్ ఆఫీసర్‌గా బలదేవ్ సహాయ్ మారాడానికి కారణాలేంటి? ఎందుకు తిరుపతిని బలదేవ్ సహాయ్ నటించమని కోరుతాడు?  ఓ లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న బలదేవ్ సహాయ్ సఫలమయ్యారా? బలదేవ్ లక్ష్యానికి ఇద్దరు హీరోయిన్లు ఏవిధంగా సహాయపడ్డారు అనే ప్రశ్నలకు సమాధనమే ‘పవర్’


బలదేవ్ సహాయ్, తిరుపతి పాత్రల్లో రవితేజ కనిపించారు. బలదేవ్ పాత్రద్వారా యాక్షన్‌ను, తిరుపతి పాత్ర ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందించడంలో రవితేజ తన మార్కును పండించారు. గతంలో విక్రమార్కుడు, బలుపు ఇతర చిత్రాల ఛాయలు అక్కడక్కడ కనిపిస్తాయి. కేవలం రవితేజను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పాత్రలకు ఆయన పూర్తి న్యాయం చేకూర్చాడు. తన ఇమేజ్‌కు సరిపోయే పాత్రలతో రవితేజ మరోసారి అభిమానులను ఆకట్టుకున్నాడని చెప్పవచ్చు.

నిరుపమ పాత్రలో హన్సిక, వైష్ణవిగా (రెజీనా)లు నటించారు. తొలిభాగంలో హన్సిక, రెండవ భాగంలో రెజీనా తమ గ్లామర్‌తో ఆలరించారు. కథకు తోడ్పాటు నందించే పాత్రలో హన్సిక కనిపించగా, కథను ముందుకు తీసుకెళ్లే పనిని రెజీనా చేశారు. అయితే ఈ సినిమా ద్వారా ఇద్దరు హీరోయినక్లు అంత గొప్పగా పేరు తెచ్చే పాత్రలేమి దక్కలేదు. 
బ్రహ్మనందం మరోసారి తనదైన శైలిలో నవ్వులు విరబోయించారు. బ్రహ్మానందం పాత్ర కథలో ప్రధాన భాగమవ్వడమే కాకుండా ఈ చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది.ఈ సినిమాతో తెలుగు చిత్రాలకు తన అవసరం ఎంత ఉందో అనే అంశాన్ని మరోసారి బ్రహ్మనందం ప్రూవ్ చేసుకున్నారు. 

ఇటీ వల కాలంలో తనదైన మార్కు కామెడీతో పలు విజయాల్లో పాలుపంచుకుంటున్న సప్తగిరి లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ప్రతిసారి మెరుపులు మెరిపించారు. నిడివి తక్కవైనా సప్తగిరి తన హాస్యంతో ప్రభావం చూపడంలో సఫలమయ్యారు. 

విలన్లుగా సంపత్, ముఖేశ్ రుషిలు ఫర్వాలేదనిపించగా, పోలీస్ ఆఫిసర్లుగా అజయ్, బ్రహ్మజీ, సుబ్బరాజులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. అతిధి పాత్రకే ప్రకాశ్‌రాజ్ పరిమితమయ్యారు.
రెగ్యులర్ సినిమాల ఉన్న కూడా రవితేజ మాత్రం ఎప్పటిలాగే తన పాత్రను పవర్ ఫుల్ గా చేసాడు. 

ఈ సినిమాను థియేటర్ లో చూసి ఆనందించండి
ఈ సమీక్షలు, రేటింగులూ కేవలం మా అభిప్రాయం మాత్రమే… ఇది ప్రేక్షకాభిప్రాయం అని చెప్పబోవటం లేదు. సినిమా కమర్షియల్ జయాపజయాలకు ఈ రివ్యూలకు సంబంధం లేదు.

0 comments:

Post a Comment