డాయం.మోహన్‌బాబు యముడి పాత్రధారిగా బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా
నటిస్తున్నారు, డాకె.వి.సతీష్-దియా నికోలస్‌లను జంటగా
తెరకు పరిచయం చేస్తూ.. డి.యస్.మ్యాక్‌స సమర్పణలో క్రిస్వీ ఫిలింస్
నిర్మిస్తున్న సినిమా `యమలీల-2'. యస్.వి.కృష్ణారెడ్డి దర్శకుడు.
కె.అచ్చిరెడ్డి ఆశీస్సులందిస్తున్నారు. . హైదరాబాద్ శిల్పకళావేదికలో ఆడియో అక్టోబర్ 26న
రిలీజవుతోంది. దర్శకుడు ఎస్వీకే మాట్లాడుతూ-``యమలీల చేసిన రెండు దశాబ్ధాల
తర్వాత `యమలీల-2' చేయడం ఆనందంగా ఉంది. యమలీలకు సంబంధం లేని కొత్త కథ ఇది.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి'' అన్నారు. అచ్చిరెడ్డి
మాట్లాడుతూ-``ప్రస్తుతం బ్యాలెన్‌స పనులు సాగుతున్నాయి. కృష్ణారెడ్డి
స్టయిల్‌లోని కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది'' అన్నారు. హీరో డాకె.వి.సతీష్
మాట్లాడుతూ-``సినిమా నాకు కెరీర్ కాదు. ఆసక్తి. నేను సినిమాల నుంచి చాలా
నేర్చుకున్నా. ఇప్పటివరకూ బిజినెస్‌లో బిజీగా ఉండడం వల్ల సినిమాల్లో
నటించడానికి కుదరలేదు. ఈ సినిమాలో నేనే కాదు అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి,
మోహన్‌బాబు, బ్రహ్మానందం అనే సూపర్‌హీరోలు పనిచేశారు. మంచి టీమ్‌తో
పనిచేసినందుకు సంతోషంగా ఉంది'' అన్నారు. నవంబర్‌లో సినిమా రిలీజ్
చేస్తామని సహనిర్మాత అరుణ్‌కుమార్ తెలిపారు.


21:41
Unknown

Posted in:
0 comments:
Post a Comment