Wednesday, 22 October 2014

రాజశేఖర్‌ "గడ్డందాస్‌"

డా. రాజశేఖర్‌ హీరోగా నటిస్తున్న చిత్రం `గడ్డం గ్యాంగ్‌'. తమిళ హిట్‌ చిత్రం `సూదుకవ్వుమ్‌'కి రీమేక్‌ ఇది. బిందాస్‌ ఫేం షీనా కథానాయికగా నటిస్తోంది. శరవణన్‌ (జర్నీ ఫేం) శిష్యుడు పి.సంతోష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. శివాని-శివాత్మిక మూవీస్‌ పతాకంపై జీవిత రాజశేఖర్‌ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగు తున్నాయి. జీవితారాజశేఖర్‌ మాట్లాడుతూ- ``రాజశేఖర్‌ గడ్డందాస్‌గా నటిస్తున్నారు. ఇంతకుమునుపు కనిపించని వైవిధ్యమైన పాత్ర ఇది. ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. అచ్చు సంగీతం అందించి ఓ పాత్రలో కూడా నటిస్తున్నాడు. సంగీతం ప్రధాన బలం. నవంబర్‌ తొలివారంలో పాటల్ని, రెండో వారంలో సినిమా రిలీజ్‌ చేస్తాం'' అన్నారు. గిరిబాబు, సీనియర్‌ నరేష్‌, సీత, దీపక్‌, అచ్చు తదితరులు నటిస్తున్నారు. కెమెరా: డేమిల్‌ జేవియర్‌, సంగీతం: అచ్చు, ఎడిటింగ్‌: రిచర్‌‌డ కెవిన్‌, నిర్మాత: జీవితా రాజశేఖర్‌.

0 comments:

Post a Comment