Wednesday, 22 October 2014

‘బాహుబలి’ ఏ రేంజ్‌లో ఉంటుందో ఈ స్టిల్ చూస్తే అర్థమవుతోంది





తెలుగు  ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ‘బాహుబలి’ ఇంతలా ఎ తెలుగు సినిమాకు ఎదురుచుడలేదు  అలాంటి హైప్ క్రియేట్ చేసింది సినిమా . ఇది  రాజమౌళి కలల సినిమా కావచ్చు! అత్యాధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం కావచ్చు! గొప్ప కథకు అతి విలువైన తెరరూపం కావచ్చు! వీటన్నింటి కన్నా ప్రధానమైంది.. ప్రభాస్‌కున్న కొండంత నమ్మకం ధైర్యం . ఆయనతో సినిమాలు చేయడానికి బోలెడంత మంది దర్శక, నిర్మాతలు వెయిటింగ్.. మరోపక్క లక్షల కళ్లతో ఫ్యాన్స్ వెయిటింగ్. కానీ ప్రభాస్ కథను నమ్మాడు. దర్శకుణ్ణి నమ్మాడు. ఓ ప్రాజెక్టు యొక్క భవిష్యత్తు ఫలితాన్ని నమ్మాడు. అందుకే ‘బాహుబలి’ చేస్తున్నాడు. ‘మిర్చి’ విడుదలై ఇప్పటికి 20 నెలలైంది. ఈ 20 నెలలు.. ఇంకా మరికొన్ని నెలలు ‘బాహుబలి’ కోసం అంకితం చేశాడు ప్రభాస్. ఆయన నమ్మకం దఫ దఫాలుగా విడుదలవుతున్న టీజర్స్, స్టిల్స్ చూస్తేనే తెలుస్తోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని ‘మిర్చి’లో అన్నట్లుగా, ఈ స్టిల్ చూస్తే ‘బాహుబలి’ ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థమవుతోంది. నేడు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ సరికొత్త స్టిల్‌ను ఆయన తన అభిమానుల కోసం ప్రత్యేకంగా విడుదల చేశారు.

0 comments:

Post a Comment