Wednesday, 22 October 2014

అల్లు అర్జున్ సరసన నిత్యామీనన్ ?

నిత్యామీనన్...అల్లు అర్జున్‌తో జోడీ కట్టనుందా? వారి కలయికలో ఓ సినిమా రాబోతుందా? అంటే నిజమే నంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వివరాల్లోకి వెళితే...అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథానుగుణంగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్‌లకు చోటున్నట్లు తెలిసింది. ఇప్పటికే సమంతా, అదాశర్మలను ఇద్దరు నాయికలుగా ఎంపికచేసిన చిత్రబృందం మరో హీరోయిన్ కోసం కొన్నాళ్లుగా అన్వేషణ సాగిస్తోంది. ఈ స్థానం కోసం ప్రణీత, రాశిఖన్నా, రెజీనా లాంటి పలువురు తారల పేర్లను పరిశీలించిన చిత్ర వర్గాలు చివరకు నిత్యామీనన్ ఎంపికచేసుకున్నట్లు తెలిసింది.

0 comments:

Post a Comment