skip to main |
skip to sidebar

00:03

Unknown
No comments

సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా
నటిస్తున్న చిత్రం పిల్లా..నువ్వులేని జీవితం. గీతా ఆర్ట్స్, శ్రీ
వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.యస్.
రవికుమార్ చౌదరి దర్శకుడు. బన్నివాసు, శ్రీ హర్షిత్ నిర్మాతలు. జగపతిబాబు
ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. చిత్ర గీతాలను ఈ నెల 25న విడుదల చేయనున్నారు.
ఇటీవలే ఈ సినిమా టైటిల్‌సాంగ్‌ను అల్లు అరవింద్ హైదరాబాద్‌లో విడుదల
చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయిధర్‌తేజ్ చాలా బాగా నటించాడు.
అతని కెరీర్‌ను మలుపుతిప్పే చిత్రమిది. మనసుకు నచ్చిన అమ్మాయి ప్రేమ కోసం ఓ
యువకుడు ఏం చేశాడనేది ఇందులో ఆసక్తికరంగా వుంటుంది.
ఈ సినిమా ఆడియో విడుదల వేడుకకు చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరవుతారు. ఈ
కార్యక్రమంలో రామ్‌చరణ్, అల్లు అర్జున్‌తో పాటు మెగా హీరోలందరూ పాల్గొంటారు
అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రేమ, యాక్షన్, సెంటిమెంట్ అంశాల
మేళవింపుతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. సాయిధరమ్ తేజ్ నటన, రెజీనా
గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కథను మలుపుతిప్పే ఓ
కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపిస్తారు. సరికొత్త కథ, కథనాలతో
తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇంటిల్లిపాది కలిసి చూసే విధంగా వుంటుంది అని
అన్నారు.
Posted in: Tollywood News
Email This
BlogThis!
Share to Facebook
0 comments:
Post a Comment