ఎన్టీఆర్ కథానాయకుడిగా
సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం గురువారం హైదరాబాద్‌లో
పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర
పతాకంపై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర
విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది. సుకుమార్ శైలిలో
సాగే కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణ కొత్త పంథాలో
వుంటుంది.
ఆయన అభిమానులు కోరుకునే అంశాలన్నీ వుంటాయి. భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాం. జనవరి 7 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడతాం. ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం అన్నారు. సుకుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌లో వున్న పవర్‌ను ఆవిష్కరించే చిత్రమిది. ఆయనతో తొలిసారి పనిచేయడం ఆనందంగా వుంది. ప్రతీకార నేపథ్యంలో కథ వుంటుంది. ట్రీట్మెంట్ కొత్తగా వుంటుంది. ైస్టెలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా అన్ని వర్గాల
ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు.

0 comments:
Post a Comment