Monday 15 September 2014

ప్రేమలో కాజల్‌?

''పెళ్లికి నేను సిద్ధమే కానీ అబ్బాయే దొరకడం లేదు అని మీడియాతో చెప్పుకుంటూనే ప్రేమాయాణం సాగి స్తోందట కాజల్‌. ఇటీవల  ఆ విష యం స్పష్టంగా అర్థమైందట.ముంబై కి చెందిన ఓ యువ వ్యాపారవేత్తతో దుబయ్ వెళ్లి  అక్కడ ఎంజాయ్ చేశారట. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బయటకు వచ్చా యి. అయితే కాజల్‌ మాత్రం యధా విధిగా ''అలాందిదేమీ లేదు, కేవలం అతను నా ఫ్రెండ్‌ మాత్రమేఅని చెప్పుకొచ్చింది. కానీ ఇటీవల ముంబై లో వీళ్లిద్దరూ తెగ తిరుగుతున్నా రట. వీళ్లను చూసిన వాళ్లు 'ఫ్రెండ్స్‌ అయ్యే ఛాన్సేలేదు, కాజల్‌ నిజంగా ప్రేమలో పడింది, అతను ప్రియుడే అని తేల్చేస్తున్నారు.మీడియా కూడా ఈ విషయం గురించి ఆరా తీస్తోందట. అందుకే ఇక ఈ వదంతులకు పుల్‌ స్టాప్‌ పెట్టేయాలని కాజల్‌ భావిస్తోందట. అతను నా ప్రియుడే అని తేల్చి చెప్పబోతోందట. మాది ప్రేమ కాదు, పెద్దలు కుదిర్చిన సంబంధమే  అని కలరింగ్‌ కూడా ఇవ్వబోతోందని సమాచారం. ఫేస్‌ బుక్‌ ద్వారా అతని వివరాల్ని బయ ట పెట్టే  ఆలోచనలో ఉందట. కాజల్‌ వలచిన ఆ కుర్రాడు ముంబైకి చెందిన వజ్రాల వ్యాపారి అని తెలి సింది. ఎలాగో కెరీర్‌ చివరి దశకు వచ్చేసింది కాబట్టి కాజల్‌ పెళ్లి చేసు కోవాలని నిర్ణయించుకుందట. వచ్చే ఏడాది ముహూర్తం  పెట్టిందట. చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తికా గానే పెళ్లిపనుల్లో పడిపోవాలని నిర్ణయించుకుందట అందాలభామ కాజల్‌. ఆమె ప్రస్తుతం  తెలుగులో 'గోవిందుడు అందరివాడేలే చిత్రంలో నటిస్తోంది. తమిళంలో ధనుష్‌తో  ఓ చిత్రం చేస్తోంది. హిందీలోనూ ఓ స్టార్‌ హీరోతో  సినిమా చేయాలని నిర్ణయించుకుందని సమాచారం.

0 comments:

Post a Comment