Wednesday 10 September 2014

మరో శ్వేతబసు..!

వ్యభిచారం కేసులో అరెస్ట్ అయి.. ప్రస్తుతం ప్రభుత్వపునరావాస కేంద్రంలో ఆవాసం పొందుతున్న శ్వేతబసు ఉదంతం మరువకముందే మరో సినినటి వ్యభిచారం కేసులో అరెస్ట్ అయింది. వివరాలలోకి వెళ్తే.. బీటెక్ బాబు అనే సినిమాలో హీరోయిన్ కు స్నేహితురాలిగా నటిచిన యువతి గుంటూరు నగరంలోని స్వర్ణభారతి నగర్ లో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. సాబ్రాజ్యం అనే మహిళా స్వర్ణభారతి నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. తమకు సమాచారం అందటంతో ఆ ఇంటిపై దాడిచేసి వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. బీటెక్ బాబు సోనిమాలో నటించిన యువతితో పాటు, చందు, పవన్ అనే ఇద్దరు టీవి ఆర్టిస్టులను కూడా అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలియజేశారు. నగరంలో ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే.. సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని నగర డీఎస్పి తెలిపారు. వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన నటిని ప్రభుత్వ పునరావాస కేంద్రానికి తరలించారు.

0 comments:

Post a Comment