Wednesday 10 September 2014

పొగబాబులూ…జర జాగ్రత్త!

భారత దేశాన్ని పొగాకు రహిత దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపధ్యంగా బహిరంగంగా సిగరెట్లు తాగేవారికి వేసే జరిమానాను ఇకపై పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది. దీనిని అనుసరించి ఇప్పటివరకు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేసే వారికి వేసే 200రూపాయల జరిమానాను 20వేల రూపాయలకు పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పొగాకు నియంత్రణపై ఢిల్లీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి రమేష్ చంద్ర నేతృత్వంలో నియమించిన నిపుణుల బృందం తాజాగా ఆరోగ్య శాఖకు తన నివేదికను అందచేసింది. కాగా ఈ నిపుణుల కమిటీ పొగతాగే వారిపై జరిమానాతో పాటుగా వయో పరిమితి కూడా విధించాలని సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే సిగరెట్ల విడి అమ్మకాలను కూడా నిషేధించాలని ఈ కమిటీ పేర్కొంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలోనే తెలియనుంది.

0 comments:

Post a Comment