పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్
పూరి, ఉల్కా గుప్తా జంటగా నటిస్తున్న ఆంధ్రాపోరి చిత్రం గురువారం
హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రసాద్ ల్యాబ్స్
అధినేత రమేష్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాజ్ మాదిరాజు దర్శకుడు.
పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు
పూరి జగన్నాథ్ క్లాప్ నివ్వగా, చిత్ర నిర్మాత రమేష్ ప్రసాద్ కెమెరా
స్విఛాన్ చేశారు. పూరిజగన్నాథ్ సతీమణి లావణ్య తొలి సన్నివేశానికి గౌరవ
దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఋషి చిత్రం తరువాత రమేష్‌ప్రసాద్ మరోసారి నాకు దర్శకుడిగా అవకాశం ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ విలువ ఏమిటో నాకు బాగా తెలుసు. కుటుంబ నేపథ్యంలో సాగే అందమైన టీనేజ్ ప్రేమకథాచిత్రమిదిఅన్నారు. ప్రసాద్ ప్రొడక్షన్ ప్రయాణంలో ఈ రోజు చాలా ముఖ్యమైనది. మా సంస్థ నిర్మిస్తున్న 30వ సినిమా ఇది. మరాఠీలో మంచి విజయాన్ని సాధించిన టైమ్‌పాస్ చిత్రం ఆధారంగా ఆంధ్రాపోరి రూపొందిస్తున్నాం
అని రమేష్ ప్రసాద్ తెలిపారు. డా.శ్రీకాంత్, పూర్ణిమ, ఈశ్వర్‌రావ్, అరవింద్‌కృష్ణ,ఊర్మిళ కనిత్కర్, ఉత్తేజ్, అభినయ, శ్రీతేజ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం:ప్రవీణ్ వనమాలి, సంగీతం:డా.జె, ఆర్ట్:రాజీవ్ నాయర్, డ్యాన్స్:చంద్రకిరణ్, సాహిత్యం:సుద్దాల అశోక్‌తేజ,రామజోగయ్యశాస్త్రి, కిట్టు విస్సా ప్రగడ, కృష్ణ మదినేని, చక్రవర్తుల.

0 comments:
Post a Comment