Saturday 27 September 2014

అక్టోబర్ 17న కరెంట్‌తీగ

మంచు మనోజ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కరెంట్ తీగ. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయిక. సన్నీలియోన్ కీలక పాత్రలో నటిస్తోంది. జి.నాగేశ్వరెడ్డి దర్శకుడు. మోహన్‌బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ సరికొత్త ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది.

మనోజ్ పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది. పోటుగాడు, పాండవులు పాండవులు తుమ్మెద చిత్రాల తరువాత ఆయనకు హ్యాట్రిక్ హిట్‌ని అందించే చిత్రమిది. టీచర్‌గా కథని మలుపు తిప్పే పాత్రలో సన్నీలియోన్ నటిస్తోంది. ఆమెపై చిత్రీకరించిన గీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. మనోజ్‌కు మామగా జగపతిబాబు సరికొత్త పాత్రలో కనిపించనున్నారు. మనోజ్ నటన, డేర్ డెవిల్ స్టంట్స్, దేవదాస్ బ్రేకప్ సాంగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. హైఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది అన్నారు.

0 comments:

Post a Comment