Saturday 27 September 2014

త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడా..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడా..? అంటే... ఔననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. త్వరలో ఈ ఇద్దరి కలయికలో ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం రూపొందనుందని తెలిసింది.

ప్రస్తుతం ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో నటిస్తున్న ప్రభాస్ ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నాడట. బాహుబలి లాంటి పవర్‌ఫుల్ సినిమా తర్వాత ఒక వినోదాత్మక కుటుంబకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఆలోచనలో వున్న ప్రభాస్‌కు ఇటీవలే త్రివిక్రమ్ ఓ కథను వినిపించడం.. దానికి ప్రభాస్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిందని సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ అల్లు అర్జున్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రాన్ని ఇంతకు ముందు ప్రభాస్‌తో ఒక విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన సంస్థ నిర్మించనుందని ఫిల్మ్‌నగర్ టాక్.

0 comments:

Post a Comment