శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రానికి
మళ్లి మళ్లీ ఇది రాని రోజు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. క్రియేటివ్
కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.విధికి తలొగ్గి తమ ప్రేమను
సాఫల్యం చేసుకోలేకపోయిన ఓ జంట ఇరవైయేళ్ల తర్వాత కలుసుకుంటారు. అప్పుడు వారి
భావోద్వేగాలు ఎలా వుంటాయి? జీవన గమనంలో వారి దృక్పథాల్లో వచ్చిన
మార్పులేమిటి? వారు కలుసుకోవడానికి దారితీసిన పరిస్థితులేమిటి? వారి బంధం
చివరకు ఏ తీరాలకు చేరింది?. ఈ ప్రశ్నలన్నింటికీ అందమైన దృశ్యరూపమే మా చిత్ర కథ అన్నారు క్రాంతిమాధవ్.
దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ చిరంజీవి నటించిన రాక్షసుడు చిత్రంలోని మళ్లి మళ్లీ ఇది రాని రోజు గీతం ఎంతటి ప్రజాదరణ పొందినదో అందరికీ తెలిసిందే. ఆ పాటలోని పల్లవిని టైటిల్‌గా పెట్టుకోవడం ఆనందంగా వుంది. పరిణితి చెందిన ప్రేమకథా చిత్రమిది. హృదయాల్ని మెలిపెట్టే భావోద్వేగభరిత సన్నివేశాలుంటాయి. సాయిమాధవ్ బుర్రా రాసిన సంభాషణలు మనసును కదిలించేలా వుంటాయి. శర్వానంద్ ఈ చిత్రంలో క్రీడాకారుడిగా కనిపిస్తారు. నిత్యామీనన్ పాత్రలో రెండు భిన్న పార్శాలుంటాయి అన్నారు.

20:24
Unknown

Posted in:
0 comments:
Post a Comment