అతడు ఏ సినిమాలో నటించినా ఆ సినిమా హీరోకి సమానమైన గౌరవాన్ని అందుకుంటాడు. ఏ
కమెడియన్‌కి దక్కనంత గౌరవం, గుర్తింపు, అవకాశాలు దక్కాయి అతడికి, అతడే మన బ్రహ్మానందం.
టాలీవుడ్‌లో ఉన్న అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించేసిన బ్రహ్మీకి
కాజల్, శృతిహాసన్, తమన్నా, నయనతార, అనుష్క ఇలా స్టార్ హీరోయిన్లందరితోనూ
నటించేసిన ఘనత బ్రహ్మీ సొంతం. అయితే అతగాడు ఇప్పుడు తమిళంలో ఉన్న స్టార్
హీరోలందరితో నటించేస్తున్నాడు. తెలుగులో ఎంత పాపులర్ అయ్యాడో, అంతే
పాపులారిటీ తమిళ్‌లోనూ తెచ్చేసుకుంటున్నాడు. ఇటీవలే సూర్య హీరోగా నటించిన సికిందర్ సినిమాలో నటించాడు.
ఇప్పుడు లేటెస్టుగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లింగా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్‌లు అనుష్క, సోనాక్షి సిన్హా ఇద్దరితో కలిసి కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నాడు. బ్రహ్మీకి అనుష్కతో కలిసి నటించడం కొత్తేమీ కాదు కానీ, సోనాక్షి మాత్రం పూర్తిగా కొత్త. ఈ ముకుపుడకల సుందరి బాలీవుడ్‌లో ఫేమస్. అక్కడ బోలెడు మంది కమెడియన్లను చూసింది కానీ మన బ్రహ్మీ లాంటి చిచ్చరపిడుగుని అస్సలు చూసి ఉండదు. కచ్ఛితంగా సోనాక్షికి జోల్ట్ ఇచ్చే రేంజు బ్రహ్మీకి ఉంది. తెలుగులో ఇంత పెద్ద స్టార్ కమెడియన్ ఉన్నారా? అని అమ్మడికి దిమ్మ తిరిగిపోయి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయం. తెలుగులో ఇంకో మూడు సినిమాలు చేస్తే 1000 ఫినిష్ చేసినట్టే అన్నాడు బ్రహ్మీ. ఒకవేళ తమిళ్‌లోనూ అంత పెద్ద లైన్ ప్లాన్ చేశాడో ఏమో?

21:44
Unknown

Posted in:
0 comments:
Post a Comment