తెలుగు పోస్టర్ రేటింగ్ 3.25/5
రజని అంటేనే స్టైల్ అన్నట్టు క్రేజ్ సంపాదించుకున్నాడు మన రజనీకాంత్ ,అలాగే లింగ సినిమాకి డైరెక్టర్ కేఎస్ రవికుమార్ గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన నరసింహ సినిమా పెద్ద హిట్ దానితో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది మరి రజని దాన్ని అందుకున్నదో లేదో చూద్దాం.
సినిమా కథ :
లింగా అనే దొంగ ఎంట్రీతో సినిమా ప్రారంభమవుతుంది లింగాకి తోడుగా సంతానం మరియు అతని బాచ్ అయితే లింగాకి వాళ్ళ తండ్రి అంటే అస్సలు పడదు ఆస్తిని అంతటిని అందరికి పంచి తనకు ఏమి మిగల్చలేదని లింగా వాళ్ళ తండ్రి పేరును తన ముందు ఎత్తవద్ధంటాడు. ఈ క్రమం లోనే లింగా కి అనుష్క పరిచయమౌతుంది అక్కడినుంచి లింగా సింగనూరు వెళతాడు అక్కడ తన తండ్రి గురించి తెలుసుకుంటాడు రాజా లింగేశ్వరాన్ (రజినీకాంత్ ) సింగనూరు అనే గ్రామంలో దేవుడు తో సమానమైన రాజు. ఆ గ్రామంలో మొదటి నుండి కూడా సరైన పంట పొలాలు పండవు. దీనికి కారణం సరైన వర్ష ప్రభావం లేకపోవడం, వర్షపు నీరును నిల్వచేసుకోవడానికి డాం లేకపోవడం తో రైతులు కష్టాలు పడుతుంటారు.అవి చూసిన రాజా లింగేశ్వరాన్ అప్పటి బ్రిటష్ ప్రభుత్వం తో ఆమోదం పొంది, డాం కట్టడానికి తన దగ్గర ఉన్న ఆస్తిని దారపోస్తాడు. ఇంతలో ఆ బ్రిటష్ ప్రభుత్వం మధ్యలోనే ఆ డాం కట్టడాన్ని అపివేయ్యలని నోటీస్ పంపి, ఆ ప్రాంతం నుండి రాజా లింగేశ్వరాన్ వెళ్లిపోయేలా చేస్తారు. తన తండ్రి ఆశయాన్ని తెలుసుకున్న లింగా ఎలాగైన ఆ పనిని పూర్తి చెయ్యాలని అనుకుంటాడు. ఈ క్రమంలో లింగా తన తండ్రి ఆశయాన్ని పూర్తి చేస్తాడా లేదా ? తన తండ్రి డాం ఎందుకు పూర్తి చేయలేకపోయాడు ? అసలు తన తన తండ్రి ఏమయిపోయాడు ? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే..
రజినీకాంత్ నటన గురించి మనం చెప్పనక్కర్లేదు. 64 ఏళ్ళు వచ్చిన కానీ ఎక్కడ కూడా తన లోని ఉనికిని పోగొట్టుకోలేదు. డైలాగ్ డెలివరీ లో ప్రేక్షకులు మరోసారి నరసింహ చిత్రాన్ని గుర్తు చేసుకుంటారు. అలాగే కేఎస్ రవికుమార్ తనదైన దర్శకత్వ ప్రతిభను కనబరిచారు. అనుష్క, సొనక్షి సిన్హా తమ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. జగపతి బాబు విలన్ రోల్ లో తనవంతు కృషి చేసాడు.సంతానం, పోలీస్ ఆఫీసర్ గా బ్రహ్మనందం కామెడీ అక్కడ అక్కడ బాగానే పడింది.
హైలైట్స్:
రజినీకాంత్ పర్‌ఫార్మెన్స్ చాల బాగుంది. రజినీకాంత్ ద్విపాత్రలో రాజు గా, ఓ దొంగగా చాల బాగా చేసాడు. తనలోని నటన, డైలాగ్ డెలివరీ ఏ మాత్రం తగ్గలేదు. అనుష్క, సోనాక్షి నటన బాగుంది. రత్నవేలు అదించిన సినిమాటోగ్రఫీ సినిమా కి హైలైట్ గా చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఖర్చు కు వెనకడుగు వెయ్యకుండా సినిమా అంత కూడా రిచ్ లేవలో నిర్మించాడు రాక్ లైన్ వెంకటేష్.
రజినీకాంత్ నుండి యాక్షన్ చూడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడాలి.
0 comments:
Post a Comment