Wednesday 1 October 2014

మంచు లక్ష్మి పాదాలతో లఘు చిత్రం!

మంచు లక్ష్మి పాదాలు...జీవితంలో ఒకరోజు పేరుతో రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన ఒక షార్ట్ ఫిల్మ్‌లో మంచు లక్ష్మి నటించింది. విశేషమేమిటంటే ఆ చిత్రంలో ఆమె పాదాలు మాత్రమే కనిపిస్తాయి. రామ్‌గోపాల్‌ర్మ షార్ట్ ఫిల్మ్ విశేషాల్ని తెలియజేస్తూ సినిమా అనేది ఒక ఉద్వేగభరితమైన అనుభవం. అయితే ఆ భావోద్వేగాల ఆవిష్కరణ ఏదైనా రెండు గంటల నిడివి వుండాల్సిన అవసరం లేదు.

నాకు ఎన్నోసార్లు ఉత్తేజపూరితమైన ఆలోచనలు వచ్చినా అవి ఒక సాధారణ చిత్ర నిడివికి సరిపోవు కనుక వాటిని వదిలేయాల్సి వచ్చింది. అయితే లఘ చిత్రంలో ఆ కాలపరిమితి వుండదు కాబట్టి మన ఆలోచనల్ని అనుకున్న రీతితో ఆవిష్కరించవచ్చు. అలాంటి ఓ వినూత్న ఆలోచనలోంచి మంచు లక్ష్మి పాదాలు..జీవితంలో ఒకరోజు షార్ట్ ఫిల్మ్ పుట్టింది. నా ఐడియాను తనతో చెప్పిన వెంటనే తన పాదాలను షార్ట్ ఫిల్మ్‌లో నటింపచేయడానికి మంచు లక్ష్మి ఒప్పుకుంది. నా మొట్టమొదటి లఘు చిత్రమిది. మంచు లక్ష్మి జన్మదినం సందర్భంగా ఈ నెల 8న యూట్యూబ్‌లో విడుదల చేయబోతున్నాం అన్నారు.

0 comments:

Post a Comment