Wednesday 1 October 2014

హాఫ్ గర్ల్‌ఫ్రెండ్‌లో

చేతన్‌భగత్ రచనలకు యువతరంతో పాటు బాలీవుడ్ వర్గాల్లోనూ మంచి క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఆయన నవలల ఆధారంగా బాలీవుడ్‌లో రూపొందిన త్రీఇడియట్స్,కాయ్‌పోచే, టూస్టేట్స్ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర చక్కటి వసూళ్లను సాధించాయి. దాంతో ఆయన రచనలతో సినిమాల్ని రూపొందించేందుకు పలువురు బాలీవుడ్ దర్శకనిర్మాతలు పోటీపడుతున్నారు. ప్రస్తుతం చేతన్‌భగత్ హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతో ఓ నవలను రచించారు.

అక్టోబర్ 1న ఈ నవల మార్కెట్‌లోకి రానుంది. విడుదలకు ముందే పాఠకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈ నవల ఆధారంగా ఓ బాలీవుడ్ చిత్రం రూపుదిద్దుకోనుంది. రియా అనే ఢిల్లీ కాలేజీ విద్యార్థిని జీవితం ప్రధానంగా రూపొందనున్న ఈ చిత్రంలో అలియాభట్ కథానాయికగా నటించనుంది. మొదట ఈ పాత్రకోసం కృతిసనన్, హ్యుమా ఖురేషి లాంటి తారల పేర్లను పరిశీలించిన చిత్ర వర్గాలు చివరకు అలియాభట్ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను ఎంపికచేసుకున్నట్లు తెలిసింది.

చేతన్ భగత్ నవల ఆధారంగా ఇటీవలే విడుదలైన టూస్టేట్స్ చిత్రంలో అనన్య స్వామినాథన్ పాత్రకు అలియాభట్ ప్రాణప్రతిష్ట చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాను దృష్టిలో పెట్టుకొనే హాఫ్ గర్ల్‌ఫ్రెండ్ కోసం అలియాభట్‌ను ఎంపికచేసినట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఎక్తాకపూర్, మోహిత్ సూరిలతో కలసి చేతన్ భగత్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

0 comments:

Post a Comment