Wednesday 1 October 2014

16 ప్రాయంలో బొద్దే ముద్దు! -హన్సిక

అప్పుడలా ఉన్నా! ఇప్పుడిలా అయ్యా!! అంటోంది పాలబుగ్గల హన్సిక. అప్పుడలా ఎందుకుందో, ఇప్పుడిలా ఎందుకయ్యిందో కూడా ముచ్చట్లాడింది. 16 ప్రాయంలో ఉన్నప్పుడు ఏ అమ్మాయి అయినా బొద్దుగానే ఉంటుంది. ముద్దొచ్చేస్తుంది. అలా ఉండడమే అప్పుడు కరెక్ట్‌. అదే 20 దాటేశాయనుకోండి.. అకస్మాత్తుగా శారీరక మార్పులొచ్చేస్తాయి. ఉన్నట్టుండి అంత బొద్దందం కాస్తా సన్నమైపోతుంది... అంటూ సుదీర్ఘంగా క్లాస్‌ తీసుకుంది అమ్మడు. అసలిలా అవసరం ఉన్నా లేకపోయినా ఇప్పుడే ఎందుకిలా క్లాస్‌ తీసుకుంటోంది అనేగా మీ సందేహం.

అవును ఇటీవలే ఈ ముద్దుగుమ్మని ఓ కొంటె కుర్రాడు కొంటె ప్రశ్న వేశాడు. ఏంటి మ్యాడమ్‌? మరీ ఇలా సన్నబడిపోతున్నారు. తిండేమైనా మానేశారా? అని అడిగారు. అంతే వెంటనే ఇలా టూకీగా సమాధానం చెప్పేసింది. వయసు చేసే మాయాజాలమది. వయసు మారే కొద్దీ అందం, ఆకృతిలోనూ మార్పులొస్తాయి. బాడీలో ఎంజైమ్‌లో వచ్చే మార్పు అది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు .. ఈ అమ్మడు ప్రస్తుతం తమిళ్‌లో పూర్తి బిజీగా ఉంది. ఇక నుంచి తెలుగులోనూ బిజీ అయిపోవాలనుకుంటోందిట. ఆరణ్మనై అనే హారర్‌ చిత్రంలో చంద్రముఖి తరహాపాత్రలో అభినయించింది హన్సిక.

0 comments:

Post a Comment