“పది మంది అబ్బాయిలు కలిసుంటారు కానీ ఇద్దరు అమ్మాయిలు కలిసుండలేరు” అనేది ఓ పాత సామెత. కానీ ఈ సామెతను అందగత్తెలు సమంత, ప్రణీత తిరగరాస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాల్లో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ బ్యూటీస్.. ముచ్చటగా మూడోసారి కూడా తెరను పంచుకోవడానికి రెడీ అయిపోయారు. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీస్తున్న కొత్త సినిమాలో సమంత, ప్రణీతలను హీరోయిన్లుగా తీసుకున్నట్లు సమాచారమ్.
‘అత్తారింటికి దారేది’ సినిమా కోసం తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మలు.. వారి స్నేహాన్ని ఆఫ్ స్క్రీన్ లో కూడా కొనసాగిస్తున్నారు. ‘రభస’ కోసం రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా, త్ర్రివిక్రమ్ మూవీతో ముచ్చటగా మూడోసారి తెరను షేర్ చేసుకోనున్నారు. బాపుగారి బొమ్మగా మురిపించిన ప్రణీత పట్ల సమంత చాలా స్పేహాంగా ప్రేమ ఉంటున్నట్లు టాలీవుడ్ సమాచారమ్. ఆ స్నేహం కారణంగానే సమంత ఇద్దరు హీరోయిన్స్ ఉన్న స్టోరీస్ ఏమైనా తన దగ్గరకు వస్తే.. వెంటనే రెండో హీరోయిన్ ప్రణీతను తీసుకొమ్మని దర్శకనిర్మాతలకు రికమెండ్ చేస్తుంట. మొత్తానికి.. లక్కీ గాళ్ సమంత, బాబు బొమ్మ ప్రణీతలకు దోస్తీ బాగానే కుదిరిందన్నమాట.
0 comments:
Post a Comment