Friday, 29 August 2014

‘ఐ’ సరికొత్త రికార్డ్..






విక్రం హీరోగా శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఐ’. కొత్త రికార్డులు నెలకొల్పడానికి సిద్ధమవుతోంది. చైనా దేశంలో రిలీజవుతున్న మొట్ట మొదటి దక్షిణ భారత చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించనుంది.

సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడు శంకర్‌. ఈయన తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు అద్భుతాలను సృష్టించాయి. ప్రస్తుతం విక్రమ్‌ హీరోగా ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా ‘ఐ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న’ఐ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు రిలీజవుందని యావత్ భారతదేశ సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రం చైనాలో కూడా విడుదల అవుతుండటం మరో విశేషం.
ఇప్పటి వరకు చైనాలో ఒక్క సౌత్‌ ఇండియా సినిమా కూడా విడుదల కాలేదు. చైనా ప్రభుత్వం ఆధీనంలో ఉండే థియేటర్లలో ప్రాంతీయ సినిమాలకు చోటే లేదు. కానీ, మొదటిసారి ఒక ప్రాంతీయ చిత్రమైన ‘ఐ’ చైనాలో ప్రదర్శించేందుకు అంగీకరించింది. దాదాపు 15 వేల థియేటర్లలో ‘ఐ’ చిత్రం రీలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దాదాపు మూడు సంవత్సరాలుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ‘ఐ’ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం చైనాలో చిత్రీకరించారు. ఇప్పటి వరకు చైనాలో చూపించని అద్భుత లొకేషన్‌లను ఈ చిత్రంలో దర్శకుడు శంకర్‌ చూపించబోతున్నాడట. చాలా కష్టతరమైన లొకేషన్స్‌లో శంకర్‌ అండ్‌ టీమ్‌ శ్రమకోర్చి షూటింగ్‌ జరిపారట. ఆ కష్టానికి తప్పని సరిగా ఫలితముంటుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. తెలుగులో ఈ చిత్రం ‘మనోహరుడు’గా రాబోతున్న విషయం తెల్సిందే.
బాలీవుడ్‌ సినిమాలు ఇప్పటివరకు మూడు వేల నుంచి ఐదువేల థియేటర్లలో మాత్రమే విడుదలైన సందర్భాలున్నాయి. సౌత్ ఫిల్మ్ ‘మనోహరుడు’ ఒకేసారి 15వేల థియేటర్ల రిలీజ్ కావడం ఒకవిధంగా సెన్సేషనేనని ఇండస్ర్టీలో చర్చించుకుంటున్నారు.

0 comments:

Post a Comment