Thursday 9 October 2014

వేసవిలో బాహుబలి....

రాజమౌళి దర్శకత్వంలో తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పలు ప్రత్యేకతల సమాహారంగా రూపొందుతోంది. ఈ సినిమా కోసం ప్రభాస్ కత్తిసాము, గుర్రపుస్వారీతో పాటు పలు యుద్ధవిద్యల్లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. 
గత రెండేళ్లుగా బాహుబలి చిత్రం కోసం పనిచేస్తున్నారు ప్రభాస్. మిర్చితర్వాత ఆయన నటించిన చిత్రమేది ప్రేక్షకులముందుకురాలేదు. దీంతో అభిమానులు బాహుబలి కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఒక సినిమా కోసం రెండేళ్లు డేట్స్ కేటాయించడం సినిమా పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనమని తెలుగు సినీ వర్గాలు చెబుతున్నాయి.
 
 ఈ చిత్రంలో ప్రభాస్ బాహుబలి, శివుడిగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారు. ఇదిలావుండగా ఈ చిత్ర షూటింగ్ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యతవున్న చిత్రం కావడంతో దాదాపు మూడు నెలలకుపైగా సమయం సీజీ వర్క్‌కే కేటాయించినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి స్వరాల్ని సిద్ధం చేశారు. అనంత్‌శ్రీరామ్, రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్నందిస్తున్నారు. డిసెంబర్ నాటికి చిత్రీకరణ పూర్తవుతుందని, వచ్చే వేసవిలో బాహుబలి ప్రేక్షకులముందుకొస్తుందని అంచనా వేస్తున్నారు.


0 comments:

Post a Comment