Thursday 9 October 2014

బాక్సాఫీసును పూర్తిస్థాయిలో కొల్లగొట్టింది

హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన చిత్రం ‘బ్యాంగ్ బ్యాంగ్’. కేవలం ఐదు రోజుల్లోనే 201.51 కోట్లు వసూలు చేసింది. బాక్సాఫీసును పూర్తిస్థాయిలో కొల్లగొట్టింది. ఒక్క భారతదేశంలోనే దీని వసూళ్లు రూ. 156.41 కోట్లు. అంతర్జాతీయంగా పలు దేశాల్లో కలిపి రూ. 45.10 కోట్లు వసూలు చేసిందని సినిమా వర్గాలు తెలిపాయి. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి రూ. 140 కోట్లు ఖర్చైతే, ఇప్పటికే నిర్మాతలకు 60 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి. వాస్తవానికి సినిమా విడుదలైన రోజున విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు ఈ సినిమా అద్భుతమైన ఎంటర్ టైనర్ అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

0 comments:

Post a Comment