Sunday 14 September 2014

ఉన్నతంగా ఆలోచించాలి!

నాకు నంబర్‌గేమ్‌పై నమ్మకం లేదు. సినిమాకు సంబంధించిన ప్రతి అంశంలో నేను సృజనాత్మకంగా ఆలోచిస్తాను. నా ప్రతిభను ఆవిష్కరించే అవకాశాల కోసం అనుక్షణం అన్వేషిస్తాను. నటిగా నాకు కొన్ని లక్ష్యాలున్నాయి. వాటిని చేరుకోవడానికి నా శక్తియుక్తులన్నింటినీ ఉపయోగిస్తున్నాను. నటీనటుల ప్రతిభ గురించి తప్ప వారి స్థానాల గురించి ప్రేక్షకులెప్పుడూ పట్టించుకోరు అని అంటోంది ప్రియాంకచోప్రా. ఇటీవలే విడుదలైన మేరీకోమ్ చిత్రంలో ఆమె అభినయానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ముచ్చటించింది. 
 తాను కెరీర్‌లో అపూర్వ విజయాలెన్నింటినో చూశానని, తనకు కొత్తగా బాక్సాఫీస్ రికార్డులు అవసరం లేదని చెప్పింది. సినిమాలోని రెండు సీన్లలో నటించే అవకాశమొచ్చినా వాటిలో పరిపూర్ణత ప్రదర్శించాలన్నదే తాను నమ్మిన సిద్ధాంతమని తెలిపింది. అత్యున్నత ప్రమాణాల్ని నిర్ధేశించుకొని జీవితాన్ని తీర్చిదిద్దుకుంటున్నానని, తను ఓ మహారాణిలా బ్రతుకుతున్నానని పేర్కొంది. నేను ఎప్పుడు ఆశావహదృక్పథంతో ఆలోచిస్తాను. నటిగా ప్రతి సినిమాలో అత్యున్నత ప్రతిభ కనబర్చడానికి ప్రయత్నిస్తాను. జీవితం తాలూకు ఏ విషయంలోనైనా ఉన్నతంగా ఆలోచించాలన్నదే నేను నమ్మిన సిద్ధాంతం అని ప్రియాంక వెల్లడించింది.

0 comments:

Post a Comment