Thursday 9 October 2014

‘వారియర్’గా బాలయ్య ....

బాలయ్య తన సినిమాలకు పవర్‌ఫుల్ టైటిల్‌లను ఎంచుకుంటున్నాడు. ఇటీవలే ‘లెజెండ్’తో మంచి హిట్ అందుకున్న బాలయ్య లేటెస్ట్‌గా మరో పవర్‌ఫుల్ టైటిల్‌కోసం అనే్వషణ జరుగుతుంది. బాలకృష్ణ, త్రిష జంటగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సత్యదేవ్ దర్శకుడు. ఈ చిత్రానికి గాడ్సే అనే పేరు పెడదామనుకొన్నారు. కానీ నెగిటివ్ టచ్ ఎక్కువగా కనిపించడంతో ఆ ఆలోచన మార్చుకొన్నారు. ఇప్పుడు మరో పేరు పరిశీలనలోకి వచ్చింది. అదే.. వారియర్. ఈ పేరైతే బాలయ్య ఇమేజ్‌కీ, కథకీ అనుగుణంగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తోందట. అయితే ఇంగ్లీష్ పేరు కాకుండా తెలుగు పేరు ఉంటే చూడండి అని బాలయ్య సలహా ఇచ్చారట. దాంతో తెలుగు టైటిల్‌కోసం చూస్తున్నారు. దొరికితే ఓకే... లేదంటే బాలయ్య సినిమాకి వారియర్
టైటిల్ పెట్టే అవకాశం ఉంది మరి!

0 comments:

Post a Comment