Thursday 9 October 2014

ఎన్.టి.ఆర్ ‘అదుర్స్-2’

ఒకకప్పుడు ఎన్నో విజయాలు ఎన్టీఆర్ ని వరించాయి కానీ ఇటీవలే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘రభస’, ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని అందించలేకపోవడంతో మళ్లీ ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు ఎన్.టి.ఆర్. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తర్వాత ఎన్.టి.ఆర్. మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఆమధ్య వచ్చి మంచి విజయాన్ని అందుకున్న ‘అదుర్స్’ చిత్రానికి సీక్వెల్ రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ సినిమాపై దర్శకుడు వినాయక్ కూడా సన్నాహాలు చేస్తున్నాడు. ‘అదుర్స్-2’గా తెరకెక్కే ఈ సినిమాకు ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి రానున్నట్టు సమాచారం.

0 comments:

Post a Comment