Tuesday 16 September 2014

‘గరం’ షూటింగ్‌ మొదలయ్యింది!

ఆది, అదాశర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘గరం’. రాజ్‌కుమార్‌.యం. నిర్మిస్తున్నారు. మదన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. మదన్‌ మాట్లాడుతూ ‘‘నా సహాయ దర్శకుడు శ్రీనివాస్‌ ఇచ్చిన కథతో తెరకెక్కిస్తున్న సినిమా ఇది. జీవన ప్రయాణంలో ఎన్ని అవాంతరాలొచ్చినా, అవన్నీ పక్కకు నెట్టేసి ముందుకు దూసుకెళ్లిపోయే పాత్రలో ఆది నటిస్తున్నాడు. జీవితమనే వాహనం చివరి దాకా నడవాలంటే ప్రేమ అనే ఇంధనం అవసరమని చెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది’’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సోమవారం నుంచి షూటింగ్‌ మొదలుపెట్టాం. ఏ హీరోకైనా ఏడో సినిమా తప్పకుండా హిట్‌ అవుతుందనేది నా అభిప్రాయం. ఈ సినిమా ఆదికి ఏడో సినిమా అవుతుంది. తప్పక హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: టి.సురేంద్రరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: నాగిరెడ్డి.బి., లైన్‌ ప్రొడ్యూసర్‌: హరికృష్ణ.జి., సంగీతం: అగస్త్య. 

0 comments:

Post a Comment