Tuesday, 16 September 2014

‘ది ఆగడు బెల్ట్‌’

మహేశ్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ‘ఆగడు’ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్‌లలో విడుదలవుతోంది. ఘట్టమనేని రమేశ్‌బాబు సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. తమన్‌ సంగీతం సమకూర్చగా ఇటీవల విడుదలైన పాటలకు అనూహ్యమైన ఆదరణ లభించిందని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో మహేశ్‌ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలోనే అతి పొడవైన పోలీస్‌ బెల్ట్‌ను రూపొందించారు. దీనికి ‘ది ఆగడు బెల్ట్‌’ అనే పేరుపెట్టారు. వైజాగ్‌ పోలీసులు, మహేశ్‌ అభిమానుల సమక్షంలో బుధవారం సాయంత్రం వైజాగ్‌ బీచ్‌లో ఆగడు బెల్ట్‌ను ఆవిష్కరించబోతున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు షోటైమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెలిపారు. ఈ బెల్ట్‌కు వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు కల్పించాలని తమ ఉద్దేశమని వారు చెప్పారు.

0 comments:

Post a Comment