Tuesday 16 September 2014

పట్టణ నేపథ్యంలో సాగే సినిమా ‘ముకుంద’

వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ముకుంద’. పూజాహెగ్డే కథానాయిక. ‘కొత్తబంగారులోకం’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాల ఫేమ్‌ శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ.జె.మేయర్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. లియో ప్రొడక్షన్స్‌ పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి) నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు, డిజిటల్‌ పోస్టర్‌కు మంచి స్పందన వస్తోంది. స్విట్జర్లాండ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. పట్టణ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఆరు పాటలున్నాయి. మిక్కీ.జె.మేయర్‌ మంచి స్వరాలిచ్చారు. త్వరలోనే పాటల్ని, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని తెలిపారు. ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకు ఉండాల్సిన క్లారిటీ నేపథ్యంలో సాగే సినిమా అని దర్శకుడు చెప్పారు.

0 comments:

Post a Comment