Tuesday 16 September 2014

పోలీసాఫీసర్‌గా పీకే

మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం పీకే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా తాలూకు అమీర్‌ఖాన్ నగ్న ప్రచార చిత్రంపై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. కథానుగుణంగా అమీర్‌ఖాన్ ఈ చిత్రంలో వివిధ గెటప్‌లలో కనిపిస్తారని తెలిసింది. కొద్దిరోజుల కిత్రం విడుదల చేసిన రెండో ప్రచార చిత్రంలో ఆయన గుజరాతీ బ్యాండ్‌మేళం కళాకారునిగా కనిపించారు. తాజాగా విడుదల చేసిన మోషన్ పిక్చర్‌లో ఆయన పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించడం విశేషం. ఈ సినిమాలో అమీర్‌ఖాన్ గ్రహాంతరవాసి పాత్రలో కనిపిస్తారని సమాచారం. దేవుడి అస్తిత్వాన్ని తెలుసుకోవడానికి ఆయన భూమిపైకి వస్తారని, ఈ క్రమంలో దేవుని ఉనికిని గురించి ఆయన సంధించే ప్రశ్నలు వ్యంగ్యంతో పాటు ప్రజల్ని ఆలోచింపజేసేవిగా వుంటాయని చిత్ర బృందం చెబుతోంది. రాజ్‌కుమార్ హీరాని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రేక్షకులముందుకురానుంది.

0 comments:

Post a Comment