Wednesday 24 September 2014

క్రిష్-తారక్ మూవీ.. ??

జూనియర్ ఎన్టీఆర్ హిట్ కోసం తపిస్తున్నాడు. ’రభస’, ’రామయ్యా.. వస్తావయ్యా’ రెండూ సినిమాలు తారక్ కు నిరాశే మిగిల్చాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ పూరీపైనే పూర్తి నమ్మకం పెట్టుకున్నాడు. పూరీ సినిమాతోనైనా హిట్ కొట్టాలనే కసితో వున్నాడు. తాజాగా, క్రిష్‌తోనూ ఎన్టీఆర్ క‌థా చ‌ర్చ‌లు సాగించిన‌ట్లు సమాచారమ్. క్రిష్ చెప్పిన కథ ఎన్టీఆర్ కు కూడా తెగనచ్చేసిందట. ప్రస్తుతం క్రిష్ బాలీవుడ్‌లో అక్ష‌య్‌ కుమార్‌తో `గ‌బ్బ‌ర్‌` తెర‌కెక్కిస్తున్నాడు. అది పూర్తికాగానే ఎన్టీఆర్ తో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఈలోగా ఎన్టీఆర్-పూరీ మూవీ కూడా పూర్తవుతుంది. క్రిష్-తారక్ మూవీకి అశ్వనీదత్ నిర్మాత వ్యవహారిస్తారని టాలీవుడ్ సమాచారమ్.

0 comments:

Post a Comment