హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలు వేయని వారుండరు. దాని మజాయే వేరు.
హైదరాబాద్ కు ఎవరు వచ్చినా దానిని తినకుండా వెళ్లరు. అంతర్జాతీయ ప్రముఖులు
వచ్చినా, జాతీయ ప్రముఖులు వచ్చినా బిర్యానీ గురించి ఆరాతీయాల్సిందే. వారి
మెనూలో మన హైదరాబాద్ బిర్యానీ ఉండాల్సిందే. మన బిర్యానీ ఘుమఘుమలు ఇక
పార్లమెంటునూ తాకనున్నాయి. ఈ మేరకు వచ్చే పార్లమెంటు సమావేశాలలో పార్లమెంటు
క్యాంటీన్ లో ఇది అందుబాటులోకి రానుంది.
టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్లమెంటు ఫుడ్ మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ అయిన ఏపీ జితేందర్ రెడ్డి పార్లమెంటు క్యాంటీన్ లో హైదరాబాద్ బిర్యానీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. పార్లమెంటు క్యాంటీన్ లో హైదరాబాద్ బిర్యానీతో పాటు మిర్చికా సలాన్, షాహీ తుక్ డా, కుర్భానీకా మీఠాలను వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి బిర్యానీ తిన్నారంటే మన ఎంపీలంతా దాని రుచికి ఫ్లాటయి పోవాల్సిందే మరి. మొత్తానికి జితేందర్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే.

0 comments:
Post a Comment