అరంభం, వీరం విజయాలతో జోరు
మీదున్నారు అజిత్. ఈ సినిమాలతో తిరిగి సక్సెస్‌ల బాట పట్టిన ఆయన వరుసగా
సినిమాల్ని అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో ఓ
సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అనుష్క, త్రిష కథానాయికలుగా
నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్‌పైనుండగానే ఆయన మరో చిత్రానికి పచ్చజెండా
ఊపారు. వీరం ఫేం శివ దర్శకత్వంతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని తిరుపతి
బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి నిర్మించబోతున్నారు. ఇటీవలే
సికిందర్ చిత్రంతో పరాజయాన్ని అందుకొన్న లింగుస్వామి త్వరలో అజిత్ సినిమాను
సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
0 comments:
Post a Comment