రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం లింగా. కె.యస్.రవికుమార్
దర్శకుడు. అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలు. పాటలు మినహా చిత్రీకరణ
పూర్తయింది.
క్లైమాక్స్ సన్నివేశాల్లో భాగంగా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లీ విట్టేకర్ అధ్వర్యంలో పలు పోరాట ఘట్టాలను తెరకెక్కించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో రజనీకాంత్ డూప్ లేకుండా నటించినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించి మరో రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్‌గా వున్నాయని, త్వరలోనే వాటిని చిత్రీకరించి రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రజనీకాంత్ జిల్లా కలెక్టర్‌గా, శక్తివంతమైన నాయకుడిగా రెండు భిన్న తరహా పాత్రల్లో కనిపించబోతున్నారు. జగపతిబాబు ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర ప్రతినాయక ఛాయలతో సాగుతున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.

0 comments:
Post a Comment