తెలుగు సినీ చరిత్రలోనే
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో బాహుబలిగా, శివుడిగా
ప్రభాస్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న విషయం తెలిసిందే.మిల్కీబ్యూటీ తమన్నా బాహుబలి
చిత్రం కోసం భారీ సాహసాలకు సై అంటోంది. తన పంథాకు భిన్నంగా కెరీర్‌లో
తొలిసారి కత్తి పట్టి కదనరంగంలో శత్రువులతో పోరాటాలకు సిద్ధపడుతున్నది.
అనుష్క, తమన్నా కథానాయికలు.దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం కొంతకాలంగా నాయకానాయికలతో పాటు చిత్రబృందం పాల్గొనగా భారీ పోరాట సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రాజామౌళి. ఈ యాక్షన్ సీక్వెన్స్‌లలో తమన్నా కూడా పాల్గొంటున్నట్లు సమాచారం. కథానుగుణంగా ఈ చిత్రంలో తమన్నాపై కూడా పలు పోరాట సన్నివేశాలుంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. నటజీవితంలో ఇలాంటి యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం ఈ సుందరికి ఇదే మొదటిసారి. తమన్నా మాట్లాడుతూ నా కెరీర్‌లో ఒక పాత్ర కోసం ఇంత కష్టాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. ఈ చిత్రం కోసం గుర్రపుస్వారీ, కత్తియుద్ధ్దాల్లో శిక్షణ కూడా తీసుకున్నాను. ఒక సవాల్‌లాగా భావించి చేస్తున్న చిత్రమిది. తప్పకుండా నా కెరీర్‌లో ఓ మైలురాయిలా నిలిచిపోతుందనే నమ్మకముంది అని తెలిపింది.

0 comments:
Post a Comment