Tuesday, 23 September 2014

పూజా హెగ్డేకూ బంఫర్‌ఆఫర్‌.................

విలక్షణ దర్శకుడు మణిరత్నం తమిళ, మలయాళ భాషల్లో ఓ సినిమాను తెరకెక్కించేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మమ్ముట్టి తనయుడు దుల్కార్ సల్మాన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కోసం కొంతకాలంగా అన్వేషణ సాగిస్తున్నారు మణిరత్నం. ఈ స్థానం కోసం ఇప్పటికే అలియాభట్, నిత్యామీనన్ లాంటి పలువురు తారల పేర్లను పరిశీలించిన ఆయన ఇటీవలే పూజాహెగ్డేను సంప్రదించినట్లు తెలిసింది.

దీనిని గురించి ఆమె మాట్లాడుతూ మణిరత్నం నన్ను సంప్రదించిన మాట వాస్తవమే. అలాంటి దర్శకుడి నుంచి పిలుపు రావడమే నాకు లభించిన గొప్ప వరంగా భావిస్తున్నాను. కానీ ప్రస్తుతం బాలీవుడ్ చిత్రం మెహంజదారోతో బిజీగా వుండటంతో ఈ సినిమాను గురించి ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే దాని గురించి వెల్లడిస్తా అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో ఒకలైలా కోసం ముకుందా చిత్రాల్లో కథానాయికగా నటిస్తుంది పూజా హెగ్డే.

0 comments:

Post a Comment